Gastric Problem: కడుపుబ్బరంతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి?

Gastric Problem: ప్రస్తుత రోజుల్లో చాలామంది కడుపుబ్బరం సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ కడుపుబ్బరం సమస్య కారణంగా తినాలి అనిపించినా కూడా తినలేకపోవడం, కోరికలను చంపుకోవడం లాంటివి చేసి ఇబ్బంది పడతూ ఉంటారు. అంతేకాకుండా ఈ సమస్యతో చాలా అసౌకర్యంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఈ సమస్య పెరుగుతున్న కొద్దీ ఆహారం అంటేనే విరక్తి పుడుతూ ఉంటుంది. కడుపుబ్బరం సమస్యతో బాధపడేవారు కూల్ డ్రింక్స్, సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు నిటారుగా కూర్చుని తినాలి. తినేటప్పుడు మాట్లాడకుండా నోరు మూసుకొని ఆహారాన్ని నమ్మిలాలి. మరి ఎటువంటి చిట్కాలను పాటించడం వల్ల కడుపుబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భోజనం చేసిన తర్వాత అటు ఇటు కొద్దిసేపు తిరగాలి. చాలామంది భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చుంటూ ఉంటారు. అలా చేయకుండా కొద్దిసేపు నడవడం వల్ల కడుపులో ఉన్న గాలి బయటకు వెళ్లిపోయి ఉబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే హస్త పదంగుష్టసనం ఈ ఆసనం పేగులో చిక్కుకున్న గ్యాస్ ను విడుదల చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం వెళ్లేకిలా పడుకుని గాలి పీల్చినపుడు రెండు చేతులను పైకి లేపాలి. ఆ తర్వాత మీ చేతులను పైకి ఉంచి శ్వాస వదులుతూ మీ రెండు కాళ్ళను నేలకు లంబంగా పైకి లేపాలి. అలా కొన్ని సెకండ్ల పాటు ఉన్న తర్వాత మళ్లీ మీ కాళ్ళను కిందికి తీసుకొని విశ్రాంతి తీసుకోవాలి.

అయితే వెన్ను నొప్పితో బాధపడేవారు ఒక్కసారి ఒక కాలు మాత్రమే పైకి లేపాలి. ఈ ఆసనాన్ని ఆరు నుంచి ఏడు సార్లు చేయడం వల్ల కడుపు బలం సమస్య నుంచి బయటపడవచ్చు. జీలకర్ర ధనియాలు, ఫెన్నెల్ మూడు సమాన పరిమాణంలో దంచాలి. వాటికి కొన్ని నల్ల మిరియాలు కూడా జోడించాలి. దానిని పొడిగా చేసి ఒక టీ స్పూన్ తీసుకొని 6 నుంచి 8 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. భోజనం చేసిన తర్వాత కడుపుబ్బరంగా అనిపించినప్పుడు ఈ నీటిని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఈ పొడిని ఒక గాజు పాత్రలో నెలలు తరబడి నిల్వ చేసుకోవచ్చు. అలాగే చాలామంది తిన్న వెంటనే పడుకుంటూ ఉంటారు. అలా కాకుండా తిన్న తర్వాత కొద్దిసేపు నడిచి ఆ తర్వాత పడుకోవడం మంచిది. జీనక్రియలో మనసు ప్రత్యక్ష పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. కోపంగా కలవర పడుతున్నట్టు టెన్షన్ పడుతున్నట్లు ఉంటే కండరాలు బిగుతుగా మారి గ్యాస్ చిక్కుకుపోతుంది. కాబట్టి మానసిక విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే జీర్ణక్రియ సరిగా జరిగి తిన్న ఆహారం జీర్ణం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -