Health Tips: ఇవి తింటే గుండెపోటు రమ్మన్నా రాదట.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?

Health Tips: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో గుండెపోటు సమస్య కూడా ఒకటి అని చెప్పాలి. ప్రతి ఏడాది గుండెపోటు సమస్య కారణంగా కొన్ని వేల మంది మరణిస్తున్నారు. అయితే ఇలా గుండెపోటు చిన్న వయసులోనే రావడానికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహారం పదార్థాలే అని చెప్పాలి.

పూర్వం మన పెద్దలు ఎన్నో రకాల చిరుధాన్యాలను తృణధాన్యాలను తీసుకునేవారు కానీ ప్రస్తుత కాలంలో ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకునే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.మనం తీసుకునే ఆహార పదార్థాల కారణంగా శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోయి గుండెపోటు రావడానికి కారణం అవుతుంది.మరి ఇలా గుండెపోటుకు గురికాకుండా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే విషయానికి వస్తే…

 

గుండె జబ్బులు మన దరికి చేరకుండా ఉండాలి అంటే రోజు వారి ఆహారంలో భాగంగా మనం ఎక్కువగాఫైబర్ ఉండే పదార్థాలను తక్కువగా కార్బోహైడ్రేట్స్ కొవ్వు పదార్థాలు కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.అలాగే ఈ ఆహార పదార్థాలతో పాటు 60 శాతం పండ్లు సలాడ్స్ వంటి వాటిని కూడా తీసుకోవడం ఎంతో ముఖ్యం ఇక మొలకెత్తిన గింజలను కూడా తీసుకోవడం ఎంతో ముఖ్యం.

 

మనం ఉడికించే ఆహార పదార్థాలను తీసుకునే వాటిలో తక్కువగా ఉప్పు కారం తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి ఇలా మన రోజువారి ఆహారంలో భాగంగా ఇలాంటి నియమాలను పాటిస్తూ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెజబ్బులు మన దరికి చేరవు.అలాగే ప్రతిరోజు వ్యాయామం కూడా చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఒత్తిడి మనపై ఉండదు తద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడి గుండె జబ్బులను అడ్డుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -