Carom Seeds: ఇవి తీసుకుంటే క్షణాల్లో గ్యాస్ మాయం అవుతుందట.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!

Carom Seeds: ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఏదో రకమైన సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఎక్కువ మంది, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గ్యాస్ సమస్య నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన వస్తుంది. అలానే, జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వలన కూడా, కలుగుతూ ఉంటుంది. చాలామంది, బాగా స్పైసీ ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం, కారం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం వలన గ్యాస్ సమస్య ఎక్కువవుతుంది.

అలాగే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు గ్యాస్ సమస్య వస్తుంటుంది. సినిమా పెద్ద అని తేడా లేకుండా ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అందులోనే ఈ ఇంటి చిట్కా చాలా చక్కగా పని చేస్తుంది. గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, వామును ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా, వాముని బాగా వాడతారు. ఎప్పటి నుంచో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉంటాయి.

శరీరంలో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి వాము బాగా సహాయం చేస్తుంది. అర స్పూన్ వాములో, చిటికెడు రాక్ సాల్ట్ వేసుకుని బాగా దంచి తీసుకోండి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని నమిలి, వచ్చే రసాన్ని మింగాలి. ఇది కొంచెం వగరుగా, చేదుగా ఉంటుంది. కానీ, తీసుకుంటే గ్యాస్ సమస్య నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. కడుపునొప్పి కూడా పోతుంది. దీనిని తీసుకున్నాక, ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగాలి. గ్యాస్ బయటకు పోయి కడుపునొప్పి కూడా బాగా తగ్గిపోతుంది.,వాముని అజీర్తి సమస్యలకి వాడుతున్నారు. రాక్ సాల్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలానే, రాక్ సాల్ట్ పేగు కదలికలని కూడా ప్రోత్సహిస్తుంది. ఆకలని కూడా ఇది బాగా తగ్గిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -