Health Tips: రాత్రి సమయంలో చపాతీలు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాటిని తింటే ఇంత ప్రమాదమా?

Health Tips: చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా చపాతి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కేవలం కొద్ది మంది మాత్రమే చపాతి తింటే అరగదు అని దానిని తినడానికి ఇష్టపడరు. అయితే ఎక్కువ శాతం ఉదయం లేదంటే రాత్రి సమయంలో చపాతీలను తింటూ ఉంటారు. ఎక్కువ శాతం మంది రాత్రి సమయంలో చపాతీలను తింటూ ఉంటారు. అలా తినడం వల్ల తొందరగా బరువు తగ్గుతారని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా రాత్రి సమయంలో చపాతీలను తింటున్నారా. అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

కొందరు రాత్రి సమయంలో అన్నానికి బదులుగా కేవలం ఒకటి లేదా రెండు చపాతీలు తిని పడుకుంటూ ఉంటారు. ఇంకొందరు రాత్రి చేసిన చపాతీలను నిలువ చేసుకుని పొద్దున్నే తింటూ ఉంటారు. అలాగే ఉదయం చేసుకున్న చపాతీలని రాత్రి తీసుకున్నా కూడా, ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. చపాతీలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవు. రాత్రివేళ జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది. అందుకని, రాత్రి పూట చపాతీలు తింటే మంచిదని డాక్టర్లు అంటున్నారు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు, చపాతీలను కాల్చేటప్పుడు ఎక్కువ నూనె వేసుకుని కాల్చవద్దు. రాత్రిపూట చపాతీలను తింటే ఎనర్జీ కూడా ఎక్కువ వస్తుంది.

అన్నం తినడం కంటే, చపాతీలు తింటే బాగా ఎనర్జీ వస్తుంది. గోధుమలలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. గుండెకి కూడా మేలు కలుగుతుంది. చపాతీలు తిన్నాక కూడా గంటన్నర తర్వాతే నిద్ర పోవాలి. రాత్రిపూట ఏడు తర్వాత తినేయండి. 10 దాటిన తర్వాత అస్సలు తినకండి. చపాతీలో కూరగా బంగాళాదుంప కూరని చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ బంగాళదుంపని తినడం వలన ఆరోగ్యానికి నష్టాలు కలుగుతాయి. చపాతీలను రాత్రిపూట తినేవాళ్ళు, ఈ పొరపాట్లు చేయకండి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -