Health Tips: పేదవాడి బాదం వేరుశనగ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Health Tips: వేరుశనగ విత్తనాలు వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని కొన్ని ప్రదేశాలలో పల్లీలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా వేరుశనగను పేదవాడి బాదం అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిలో కేలరీలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు ఫైబర్ లభిస్తాయి. పల్లీల్లో ఫైబర్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. వేరుశనగ విత్తనాలలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాపడతుంది. అంతేకాకుండా వేరుశనగ విత్తనాల వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పేదవాని బాదంగా చెప్పే వేరుశెనగలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోజు గుప్పెడు తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. వేరుశెనగలో ప్రోటీన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, నియాసిన్, థయామిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. వేరుశెనగ తినడం వల్ల రక్తం గడ్డ కట్టడాన్ని ఆపుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు రావు. అలాగే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

 

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అయితే కొంతమంది వేరుశనగలను తీసుకోకూడదు. చర్మంపై ఎలర్జీ, దురద, ముఖంపై వాపు వంటి సమస్యలు ఉన్నవారు వేరుశనగ ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఆ సమస్యల ప్రభావం పెరుగుతుంది. అలాగే గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా వేరుశనగను తీసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. వీటి నుంచి విడుదల అయ్యే ఒక రసాయనం కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వేరుశనగ గింజలను తీసుకున్న వెంటనే నీటిని తాగకూడదు. ఇలా నీటిని తాగితే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు వంటివి వస్తూ ఉంటాయి. అజీర్ణ సమస్య ఉన్నవారు కూడా వేరుశనగకు దూరంగా ఉంటేనే మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -