Janasena: కొడుకు కోసం దాచిన డబ్బులను రైతులకు ఇస్తున్నాడు!

Janasena: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ దూసుకెళ్తున్నారు. అయితే సినిమాలకంటే వ్యక్తిత్వం పరంగా పవన్ కళ్యాణ్ చాలా ఫేమస్ అయ్యారు. నా అనుకున్న వారికి అండగా నిలవడం.. ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిస్తే.. పరిగెత్తుకుంటూ వెళ్లడం.. పవన్ కళ్యాణ్ నైజం. ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎక్కువగా ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో దారుణంగా విఫలమైనా పవన్.. ఈ సారి మాత్రం కచ్చితంగా విజయం సాధించాలనే కసితో పోరాడుతున్నారు. ప్రజా సమస్యల పోరాటంపై కదం తొక్కుతున్నారు.

 

ప్రస్తుతం కౌలు రైతులను ఆదుకునేందుకు పవన్ మరోసారి నడుం బిగించారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉంటే కౌలు రైతులను కలిసి.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి సాయం కూడా అందిస్తున్నారు. దాదాపు 150 కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్క కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున ఆర్థికసాయం చేసేందుకు పవన్ సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ నటుడు పృథ్వీరాజ్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ..‘పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు ఖర్చు పెడుతోన్న ప్రతి రూపాయి తన కష్టార్జితం. ఆయన ఎవర్నీ దోచుకోలేదు. ఏమీ దాచుకోవట్లేదు. తన పిల్లల కోసం కూడా సంపాదించుకోవట్లేదు. సంపాదించి దాచి పెట్టుకున్న డబ్బులు కూడా రైతులకు పంచి పెడుతున్నారు. అకీరానందర్ కోసం దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేశారు. ఈ విషయాన్ని గతంలో నాగబాబు కూడా చెప్పుకొచ్చారు. ఇలా ఉంటే రేపు పిల్లలు ఎలా బతుకుతారని బాధపడ్డారు. కానీ ఆ విషయాలకు ఎప్పుడూ పవన్ లెక్క చేయలేదు. కల్మషం లేని మనిషి పవన్ కళ్యాణ్. ఎలాంటి ఫలితం ఆశించకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు.’ అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాన్ చేస్తున్న పనికి చాలా మంది మెచ్చుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -