Pawan Kalyan-Balayya: బాలకృష్ణ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత పని చేశాడా?

Pawan Kalyan-Balayya: “ఆహా” లో నందమూరి నటసింహం బాలకృష్ణతో చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. దానితో అన్ స్టాపబుల్ సీజన్ 2 తీస్తుండగా.. అది కూడా మంచి క్రేజ్ తో సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది. ఎక్కడో ఒక ఎపిసోడ్ వదిలేస్తే.. మిగతా అన్ని ఎపిసోడ్స్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రాజకీయ నాయకులు, స్టార్ హీరోలు, పాత తరం నాయికలు, ఫేమస్ నటీనటులతో షో సక్సెస్ ఫుల్ గ దూసుకుపోతుంది. ఇక ఇటీవల ప్రభాస్ తో, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, రాశీఖ‌న్నాతో, తాజాగా పవన్ కళ్యాణ్ తో ఎపిసోడ్స్ తీశారు.

 

పవర్ స్టార్ తో బాలయ్య ‘ఆహా’
ఇప్పటికే ప్రభాస్ తో ఎపిసోడ్ తో భారీ అంచనాలు నెలకొనగా.. జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, రాశీఖ‌న్నా ఎపిసోడ్ ల కోసం జనాలు ఎంతగానో వేచిచూస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ షోకు రావడంతో అంచనాలు భారీగా పెరిగి, ఈ ఎపిసోడ్ కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి టాక్ షోలలో పాల్గొనరు. అలాటిది ఆహా కి పవన్ వచ్చేసరికి ఆ ఎపిసోడ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతజ్ఞో చూస్తున్నారు.

 

ప్రభాస్ తో పాటు తన మిత్రుడు గోపీచంద్.. జయసుధ, జయప్రధలతో పాటు రాశిఖన్నా.. రావడంతో ఈ ఎపిసోడ్ లకు మరింత క్రేజ్ వస్తుందని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు.. మధ్యలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథిగా వస్తున్నట్టు సమాచారం. ఇక ఇదివరకు పవన్, త్రివిక్రమ్ అత్తారింటికి దారేది టైమ్ లో చేసిన ప్రొమోషనల్ షో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. తాజాగా వీరిద్దరూ ఆహా కి రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి ఆహా లో చేసే ఎపిసోడ్ చిత్రికరణ ఈ నెల 27 జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ షో షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు ఒకరోజు విరామం ఇచ్చి మరీ ఆహా షో కి హాజరయ్యాడట. దీనితో బాలయ్య కోసం పవన్ ఇంత త్యాగం చేశాడా? అంటూ ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -