Samantha: నువ్వు ఐరన్‌ ఉమెన్‌.. ఏదీ నిన్ను ఓడించలేదు సమంతపై నటుడి కామెంట్స్‌!

Samantha: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం యశోద విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇందులో ఫైట్ సీన్లలో సమంత చాలా కష్టపడి నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే సమంత సంచలన విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాను అరుదైన జబ్బు మయోసైటిస్‌తో బాధపడుతున్నానంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది సమంత.

 

అంతకు ముందు కూడా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత కాస్త డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు సమంత కనిపించారు. ఆరంభంలోనే సినీ కెరీర్‌కు ముందు పాకెట్‌ మనీ కోసం సమంత కష్టపడింది. పెళ్లి రిసెప్షన్లు, ఫంక్షన్లు తదితర సేవలు అందించిన సమంత.. తర్వాత హీరోయిన్‌ అయ్యాక ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఈ క్రమంలో అనేక అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చేశాయి.

 

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేశావే చిత్రంతో సమంత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీనే మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ స్థాయిలో సమంతకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో బాధపడుతుండడంతో చాలా మంది ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఆమెకు స్నేహితుడైన రాహుల్‌ రవీంద్రన్‌.. తాజాగా సమంత గురించి ఓ పోస్టు పెట్టాడు.

 

ఇంకా శక్తివంతంగా చేస్తాయి..
సమంతకు ధైర్యం చెబుతూ ట్విట్టర్‌లో రాహుల్‌ రవీంద్రన్‌ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో.. ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు పోరాడుతూనే ఉంటావంటూ సమంతను రాహుల్‌ రవీంద్రన్‌ అభినందించాడు. ఎందుకంటే నువ్వు ఐరన్‌ ఉమెన్‌ అని పేర్కొన్నాడు. సమంతను ఏదీ ఓడించలేదని, కష్టాలు బాధించకుండా నిన్ను ఇంకా శక్తివంతంగా మారుస్తాయని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు రాహుల్‌ రవీంద్రన్‌. దీనికి సమంత కూడా రిప్లైయ్‌ ఇచ్చింది. థ్యాంక్యూ రాహుల్.. నాలాగే బయట ఎవరైనా పోరాడుతుంటే వారికి కూడా నేను ఇదే చెబుతానంటూ బదులిచ్చింది సమంత.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -