Balayya-Pawan: అన్ స్టాపబుల్ లో పవన్..మూడు పెళ్లిళ్ల గురించి ప్రశ్నించిన బాలయ్య

Balayya-Pawan: బుల్లితెరపై పలు షోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి పాపులారిటీని సంపాదించిన షోగా అన్ స్టాపబుల్ ను చెప్పొచ్చు. ఈ షో ఆహా ఓటీటీ వేదికగా సాగుతోంది. మొదటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో రెండో సీజన్ లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ షో గురించే చర్చ సాగుతోందని చెప్పాలి. అన్ స్టాపబుల్ 2 షో బాలయ్య తన దైన శైలిలో అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

 

తాజాగా మంగళవారం రోజున ఎపిసోడ్ షూటింగ్ పూర్తవ్వగా ఈ షో గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పవన్- బాలయ్య కలిసి ఎపిసోడ్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ షో రేంజ్ ఇంకాస్త పెరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. బాలయ్య, పవన్ కలిసి చేసిన ఈ ఎపిసోడ్ కు సంబంధించి అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. వీరిద్దరితో షూట్ ఎలా జరిగింది? బాలయ్య పవన్ ను ఎలాంటి ప్రశ్నలు అడిగారు? రాజకీయ ప్రశ్నలు ఉన్నాయా లేదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

 

అన్ స్టాపబుల్ షోలో బాలయ్య పవన్ కళ్యాణ్ ను తన పెళ్లిళ్ల గురించి అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ నుంచి పవన్ పెళ్లిళ్ల వ్యవహారం లీకైందని, ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్నించగా పవన్ అందుకు సమాధానం చెప్పినట్లు ఓ వార్త లీక్ అయ్యింది. ఆ తర్వాత బాలయ్య కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారని, ఇకనుంచి ఎవరైనా పవన్ మూడు పెళ్లిళ్లపై కామెంట్స్ చేస్తే ఊరకుక్కలతో సమానం అంటూ సంచలన కామెంట్స్ చేసినట్లుగా సమాచారం.

 

అలాగే ఈ షోలో జరిగిన మరికొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. పవన్ ఖుషీ సినిమా స్టైల్లో బ్లాక్ హుడీ వేసుకుని ఈ షోకు రాగా క్లీన్ షేవ్ లో కనిపించారు. దీంతో పవన్ అభిమానులు ఆ హుడీ గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఆ హుడీ ధర ఎంత అంటూ అందరూ గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ హుడీ హ్యూగో బాస్ కంపెనీకి చెందిందని, దాని ధర విదేశాల్లో 245 డాలర్లు అని, ఇండియాలో అయితే రూ.20 వేల నుంచి రూ.27 వేల వరకు ఉంటుందని మరికొందరు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -