Alwal: దారుణం.. ఒకరికోసం ఒకరు ప్రాణాలు తీసుకున్న తల్లి కూతురు?

Alwal: తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. తల్లి కోసం కూతురు, కూతురు కోసం తల్లి ఆత్మహత్య చేసుకున్నారు.. అసలేం జరిగిందంటే..

నిజామాబాద్ జిల్లా నవీపేటలో నివసిస్తున్న శారద, సంజయ్ దంపతులకు మౌనిక అనే 26 ఏళ్ళ కూతురు ఉంది. నాలుగు ఏళ్ల కిందటే శారద భర్త సంజయ్ చనిపోయాడు. దాంతో శారద అప్పటి నుంచి తన కూతురును చూసుకుంటూ ఉండేది. ఇదిలా ఉంటే కూతురు మౌనిక ఎంబీఏ చదివి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తోంది. ఊరిలో తల్లి ఒకతే ఉంటుండడం తో మౌనిక తనతోపాటు తల్లి కూడా ఉండాలి అని హైదరాబాద్కు తీసుకుని వచ్చింది.

 

ఇద్దరు కలిసి నగరంలోని అల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కూతురు ఉద్యోగం తల్లిని పోషిస్తూ వస్తోంది. అయితే మౌనిక గతంలో ఉద్యోగం ఒత్తిడి భరించలేక ఉద్యోగాన్ని మానేసింది. ఇక అప్పటినుంచి మౌనిక తల్లి శారద స్థానికంగా ఉండే ఒకచోట పని చేస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చింది. భర్త లేకపోవడంతో శారదా కుటుంబ భారం మొత్తం తన భుజాలపై వేసుకుంది. తన తల్లి పడుతున్న బాధను చూడలేక మౌనిక మనస్థాపానికి లోనయ్యింది. తాను తల్లికి భారం కాకూడదని ఊహించని నిర్ణయం తీసుకొని తల్లి పనికి వెళ్ళిన తర్వాత తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

 

ఇక సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన శారదా కూతుర్ని ఆ విధంగా చూడడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి కన్నీరు మున్నీరుగా విలపించింది. కూతురిని మృతిని తట్టుకోలేక తల్లి శారదా కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు చేసుకుంది. శారద, మౌనికపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వాళ్లకు ఫోన్ చేయగా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా వాళ్ళు గదిలో విగత జీవులుగా పడి ఉండడం చూసి రోదించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -