Prabhas: ఆ 16 మంది అంటే బాహుబలికి ఇంత అభిమానమా?

Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంల తెరకెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె లాంటి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు.

 

రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి సహాయం చేస్తూ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ నిజజీవితంలో మాత్రం ప్రభాస్ ఎంతో సింపుల్ గా ఉంటాడు. తన సినిమాల విషయంలో తప్పితే మరే ఇతర విషయాలలో తల దూర్చడు. ఇక హీరో ప్రభాస్ కి ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రభాస్ కేవలం 16 మందిని ఫాలో అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉండగా మరి ప్రభాస్ 16 మందిని ఎందుకు ఫాలో అవుతున్నాడు అన్నది చర్చనీయాంశంగా మారింది.. మరి ప్రభాస్ ఫాలో అవుతున్న ఆ సెలబ్రిటీలు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

దివంగత కృష్ణం రాజు గారు, సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్, హీరోయిన్ కృతి సనన్, ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, డైరెక్టర్ రాధాకృష్ణ
హీరోయిన్ శృతిహాసన్, ప్రశాంత్ నీల్, లెజెండ్ అమితాబ్, ఓం రౌత్, దీపికా పదుకొనే, నటి భాగ్య శ్రీ
హీరోయిన్ పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్, అలాగే డైరెక్టర్ సుజీత్. ఇలా ప్రభాస్ కేవలం ఈ 16 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇకపోతే ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆది పురుష్ సినిమా టీజర్ విడుదల కాగా ఆ సినిమాపై భారీగా ట్రోలింగ్స్ నెగిటివ్ కామెంట్స్ వినిపించడంతో ఈ సినిమాను విడుదల చేయడానికి మరికొంత సమయం తీసుకుని అందులోని తప్పులను సరి చేస్తున్నారు చిత్ర బృందం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -