Apple AirPods: రూ.21 వేల ఎయిర్ పోడ్స్ కేవలం రూ. 1490 కే.. ఎలా అంటే?

Apple AirPods: కొత్త సంవత్సరం మొదలుకాండడంతో ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు బైక్స్ కార్స్ ఇలా ఎన్నో వస్తువులపై ఆయా కంపెనీలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ అండ్ సేల్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఎన్నో వస్తువుల విషయంలో భారీగా ఆఫర్లను ప్రకటించింది. ఇక ఇందులో భాగంగానే అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ పై భారీగా డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ క్రమంలోనే యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్‌పాడ్స్‌ పై ఫ్లిప్‌కార్ట్‌ భారీగా డిస్కౌంట్ ను అందిస్తోంది. అయితే మాములుగా యాపిల్‌ కంపెనీకి చెందిన ప్రతీ ప్రొడక్ట్‌ ధర భారీగా ఎక్కువగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 

దాంతో చాలామంది వినియోగదారులు యాపిల్ కు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడంలో కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ భారీగా ఆఫర్ ప్రకటించిన ఆ యాపిల్‌ ఎయిర్‌పోడ్స్‌ ప్రో అసలు ధర రూ. 20,990. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్ లో బాగా దీనిని కేవలం అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ ప్రోపై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ పేమెంట్స్‌పై 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. వీటితో ఈ ఎయిర్‌ పాడ్స్‌పై రూ. 2000 తగ్గింపుతో రూ. 18,990కే లభిస్తుంది.

 

దాంతో పాటుగా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 17,500 వరకు తగ్గింపుతో కేవలం ఈ ఎయిర్‌ పాడ్స్‌ని రూ. 1490కే సొంతం చేసుకోవచ్చు. అయితే పాత ఫోన్‌ ధర ఫోన్‌ దాని కండిషన్‌ పై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఎయిర్‌ పాడ్స్‌ ఫీచర్ల విషయానికొస్తే.. వాటిలో అత్యాధునిక నాయిస్‌ క్యాన్సలైజేషన్‌ టెక్నాలజీని అందించారు. ఇయర్‌ ఫోన్స్‌ను టచ్‌తోనే కంట్రోల్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. చార్జింగ్‌ కేస్‌ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే 30 గంటలు పాటు పనిచేస్తుంది. ఐపీఎక్స్‌3 స్వెట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ను అందించారు. .

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -