RaviTeja: రవితేజకు వరుసకు శృతి ఏమవుతుందో తెలుసా?

RaviTeja: టాలీవుడ్ లో దాదాపు అందరు పెద్ద హీరోలతో సినిమాలు చేసి, మంచి హిట్స్ అందుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్. ఐతే ఇప్పుడు ఈ భామ వయసు కొంత పెరిగిపోయి.. మూడు పదులకు దగ్గరవడంతో సీనియర్ తెలుగు హీరోలకు ఆప్షన్ గా మారిపోయిందట. ఇటీవల బాలయ్య బాబు వీరసింహారెడ్డి మరియు చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు సినిమాల్లోనూ ఈ అమ్మడే హీరోయిన్ గా చేయడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరుతోంది. అయితే ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలు ఉండడంతో.. టాలీవుడ్ లో శృతి హవానే నడుస్తోంది.

రవితేజకు శృతి హాసన్ వదినా?
టాలీవుడ్ లో ఒక హీరోతో ఒక సినిమాలో హీరోయిన్ గా చేసిన నటీనటులు.. వేరే సినిమాలో వారితో కలిసి ఇతర పాత్రల్లో చేయడం సహజం. అయితే ప్రస్తుతం చిరంజీవితో వాల్తేరు వీరయ్య మూవీలో హీరోయిన్ గా చేస్తున్న శృతి హాసన్.. అదే సినిమాలో నటిస్తున్న రవితేజ మధ్య ఆ సినిమాలో సంబంధం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవికి వరుసకు సవతి సోదరుడు రవితేజ. కాగా.. శృతి చిరుకు జంటగా నటిస్తోంది. దీనితో శృతి హాసన్, రవితేజ మధ్య సంబంధంపై చర్చ మొదలయ్యింది.

గతంలో రవితేజ శృతి హాసన్ కలిసి హీరో హీరోయిన్లుగా చాల సినిమాల్లోనే నటించారు. బలుపు సినిమాలో రవితేజకు గర్ల్ ఫ్రెండ్ గా చేసింది శృతి. క్రాక్ మూవీలో భార్యగాను నటించింది. ఇక ప్రస్తుతం చిరంజీవి ముఖ్య కథానాయకుడిగా వస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో కథానాయికగా నటిస్తోన్న శృతి హాసన్.. అదే సినిమాలో చిరు తమ్ముడైన రవితేజకు వదిన అవుతుంది. అంటే వాల్తేరు వీరయ్య మూవీలో శృతి హాసన్.. రవితేజ వదిన అన్నమాట.

ఇలా హీరోయిన్ గా నటించిన నటి.. అదే హీరోతో వేరే పాత్రలో నటించడం తెలుగు ఇండస్ట్రీలో సాధారణమే. అప్పట్లో చిరుతో హీరోయిన్ గా నటించిన అన్న‌పూర్ణ తర్వాతి రోజుల్లో చిరుకు అమ్మగా నటించింది. మోహన్ బాబుతో కథానాయికగా చేసిన వెన్నిరాడై తర్వాత సినిమాల్లో మోహన్ బాబుకు తల్లిగా నటించింది. ఇక రవితేజతో హీరోయిన్ గా చేసిన శృతి హాసన్.. ప్రస్తుతం తనకు వదినగా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలలో ఏది హిట్ అయినా శృతి గెలిచినట్టే అని శృతి ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -