Ram Charan: ఉపాసనపై చరణ్‌కు ఇంత ప్రేమా.. ఏం చేశాడంటే?

Ram Charan: ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్​. ‘చిరుత’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగేట్రం చేసిన చెర్రీ.. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మగధీర’తో టాలీవుడ్ లో నయా స్టార్ గా అవతరించాడు. ‘రచ్చ’, ‘నాయక్’, ‘ఆరెంజ్’, ‘బ్రూస్ లీ’, ‘గోవిందుడు అందరివాడే’ చిత్రాలతో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

చరణ్​ కెరీర్ లో ‘రంగస్థలం’ మూవీ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఒకరకంగా ఆ మూవీకి ముందు ఆ తర్వాత అన్నట్లుగా ఆయన కెరీర్ ను విభజించొచ్చు. నటుడిగా చెర్రీ స్టామినా ఏంటో నిరూపించిందీ మూవీ. ఇక గతేడాది ప్రథమార్థంలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో నటవిశ్వరూపాన్ని చూపించాడు చరణ్​. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

 

అంతటా పెరుగుతున్న క్రేజ్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు పోటాపోటీగా డ్యాన్సులు, ఫైట్లలో అదరగొట్టాడు చరణ్​. తనదైన హావభావాలతో ఎమోషనల్ సీన్స్ లో ఆడియెన్స్ కళ్ల వెంట నీళ్లు తెప్పించడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు. అందుకే ఉత్తరాదిన కూడా ఆయనకు మస్త్ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కోలీవుడ్ మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చెర్రీ.

 

‘ఆర్సీ 15’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో మూవీ రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇటుంచితే.. రామ్ చరణ్​ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య ఉపాసన బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన కోసం రామ్ చరణ్​ కొంతకాలం షూటింగ్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో ఉపాసనపై చెర్రీకి ఇంత ప్రేమా అని నెటిజన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -