Hyderabad: చావులో కూడా వీడని బంధం.. కుమారుడు దగ్గరికి వెళుతూ అలా?

Hyderabad: దేశవ్యాప్తంగా నిత్యం రోజుల్లో పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రతి పది మందిలో ఏడుగురు మరణిస్తున్నారు. అయితే అతివేగం కారణంగా నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరు నిదానంగా బండి డైవ్ చేస్తున్నప్పటికీ మరొకరు చేసే తప్పు వల్ల ఇద్దరి ప్రాణాలు బలి అవుతున్నాయి. ఈ ప్రమాదాల బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది..

 

తునికి తులసీదాస్,రాజమణి దంపతులు నిర్మల్ పట్టణానికి చెందిన వీళ్లు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ దంపతులకి చాలా ఏళ్ల కిందటే పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం. ఇక పెళ్లైన కొంత కాలానికి కుమారుడు వీరికి రామరాజు జన్మించాడు. ఆ దంపతులు చిన్నప్పటి నుంచి కుమారుడిని ఉన్నతమైన చదువులు చదివించారు. కొడుకులు రామరాజు సైతం బాగా చదువుకుని నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తులసీదాస్, రాజమణి దంపతులు నిర్మల్ టౌన్ లో ఉంటుండగా, కుమారుడు మాత్రం గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు. ఇక తాజాగా కొత్త సంవత్సరం రోజు తల్లిదండ్రులు కుమారుడు రామరాజు వద్దకు వెళ్లాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం నిర్మల్ నుంచి బయలు దేని మధ్యాహ్నం బోయినపల్లి బస్టాండ్ లో బస్సు దిగారు.

 

ఆ తర్వాత గచ్చిబౌలి వెళ్దామని పఠాన్ చెరువు బస్సు ఎక్కడానికి ఆ దంపతులు రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అటు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఈ దంపతులను ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో ఎగిరి రోడ్డు పై పడ్డ ఈ దంపతులు ఇక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇక స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొడుకు రామ రాజు కు సమాచారం అందించడంతో హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న రామరాజు తల్లిదండ్రులను ఆ విధంగా చూసి కన్నీరుగా విలపించాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -