Delhi: కారు ఢీకొట్టినా.. స్తంభం మీద పడినా చిన్న గాయపడలేదు.. ఎందుకో తెలుసా!

Delhi:  ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం, అతి వేగంగా వాహనాలు పడుపుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపట్టినా కొందరు యువకులు వేగంతో దూసుకెళ్తున్నారు. కొందరు వేగంలో కిందపడినా వారి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడుతుంటారు. తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫుటేజీలోని ప్రతి ఒక్కరిని ఆలోజింప చేసేలా ఉంది. తాజాగా ఢిల్లీ పోలీసులు అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి హెల్మెట్‌ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

ఓ యువకుడు బైక్‌ మీద ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డుపై ఓ కారు లైఫ్ట్‌ టర్న్‌ తీసుకోబోతూ ఆగింది. ఆ యువకుడు కారు అలా వస్తుందని ముందుగా ఊహించలేదు. అతి వేగం వల్ల కారు దగ్గరకు రాగానే సడెన్‌ బ్రేక్‌ వేశాడు. దాంతో బండి స్కిడ్‌ అయ్యింది. బండితో సహా రోడ్డుపై పడి దొర్లాడు బండి రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టింది. అతడు హెల్మెట్‌ ధరించడం వల్ల అతని తలకు ఎలాంటి గాయాలు కాలేదు. అతను ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇదంతా చూస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డాడని అనుకుంటుండగా అంతలోపే మారో ప్రమాదం ముంచుకొచ్చింది. బైక్‌ ఢీ కొట్టిన పోల్‌ అతని మీద పడిపోయింది. అంత బరువుగల పోల్‌ అతడి తల మీద అమాంతం పడే సరికి అతడు ప్రాణాలొదిలి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ అలా మాత్రం జరగలేదు. అతడి తలకు ఎటువంటి గాయాలు కాలేదు.

ఒకవేళ అతడు హెల్మెట్‌ ధరించి ఉండకపోతే బైక్‌ మీది నుంచి పడినపుడు బతికి బట్టకట్టినా పోల్‌ తల మీద పడినపుడు అతడు కచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అమ్మో బాబోయ్‌ ప్రాణాలతో బయటపడ్డాడని కొందరు.. హెల్మెట్‌ పవరంటూ మరి కొందరు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూన్నారు. ఈ వీడియో చూసిన పలువురు పోలీసు అధికారులు స్పందిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వాహనంపై వెళ్లినప్పుడు కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలంటున్నారు. ఒకవేళ ఈ వీడియోలోని యువకుడు హెల్మెట్‌ ధరించకుండుంటే ఆ అబ్బాయి ప్రాణాలు దక్కేవి కావని అందుకే బైక్‌పై వెళ్తున్నప్పుడు రైడర్‌తో పాటు వెనక కూర్చునేవారు కూడా హెల్మెట్‌ ధరించాలని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -