Kushi: రీరిలీజ్ లో ఖుషి చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Kushi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే ఆయన వీరాభిమానులు మాత్రం వాస్తవాలను గ్రహించరని నెటిజన్లు అంటున్నారు. రాజ‌కీయం విష‌యంలోనే అనుకుంటే ఈ జాడ్యం సినిమాల‌కు కూడా పాకిందని అనిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను దేవుడని వీరాభిమానులు వ్యవహరిస్తున్నారు. ఇది కొత్తమే కాదు. అయితే తాజాగా త‌మిళ ఖుషీ సినిమాను పవన్ వీరాభిమానులు ట్రోల్ చేస్తున్న తీరు విడ్డూరంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ఖుషీ సినిమా చాలా బావుందని, అదే తమిళ్ లో తీసిన ఖుషీ సినిమా మాత్రం అంతగా బాలేదని వారు అంటున్నారు. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్స్ ప్రెష‌న్లు అద్భుతంగా ఉన్నాయని, తమిళ్ లో అయితే విజ‌య్ ఎక్స్ ప్రెష‌న్లు అంతగా బాలేవని పవన్ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల గురించి చర్చ నడుస్తోంది.

 

తెలుగు ఖుషీ సినిమా చూసిన అభిమానులు తమిళ ఖుషీ సినిమాను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తెలుగు ఖుషీ సినిమాను వాస్త‌వంగా తీసింది త‌మిళ వెర్ష‌న్ ఆధారంగా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. త‌మిళంలో ఖుషీ సినిమా హీరో విజ‌య్, హీరోయిన్ జ్యోతిక‌ల కాంబోలో ఎస్జే సూర్య డైరెక్షన్ లో 2000వ సంవత్సరంలో రిలీజ్ అయ్యింది.

 

అక్కడ ఆ సినిమా ఘన విజయం సాధించింది. అందుకే తెలుగులో పవన్ కళ్యాణ్ ఖుషీని తీశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు విజయ్ తీసిన ఖుషీ సినిమాను వెక్కిరిస్తున్నారని, అలా చేయడం తప్పని, వారు నవ్వుకోవడం వల్ల లాభం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -