Sukumar: ఆ స్టార్ హీరోయిన్ పై సుకుమార్ కు ఇంత అభిమానమా?

Sukumar: టాలీవుడ్ లెక్కల డైరెక్టర్.. అదే సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినిమాను సుకుమార్ చూసే, తీసే కోణం చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే తన ప్రతి సినిమాలో కొత్తదనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక్కో సీన్ ను ఎంత ఖచ్చితత్వంతో తీస్తాడంటే.. ఎక్కడా లాజిక్ మిస్ అవ్వదు, ఎమోషన్ మిస్ అవ్వదు. ప్రతీ సీన్ లోనూ తనదైన ముద్ర వేస్తాడు సుకుమార్. అందుకే టాలీవుడ్ లో తనలాంటి డైరెక్టర్ మరొకరు లేరు. సినిమా స్థాయిని పెంచేలా దర్శకత్వం వహించడమే సుకుమార్ ప్రత్యేకత.

 

సుకుమార్ తీసే ఏ సినిమానైనా దేనికదే ప్రత్యేకం. ఒక్కో మూవీని భారీ స్థాయిలో, సరైన కథనంతో తెరకెక్కిస్తాడు. ఇక ఇటీవల అల్లు అర్జున్ తో తీసిన “పుష్ప” ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. పాన్ ఇండియా స్థాయిలో గొప్ప టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టింది. దీనితో ప్రస్తుతం “పుష్ప-2” సినిమాపై ఫోకస్ పెట్టాడు సుకుమార్‌. ఎలాగో ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుంది, దీన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన శైలిలో మరో బ్లాక్ బస్టర్ అందించడానికి సిద్దమవుతున్నాడు సుకుమార్‌.

 

అందాలపై ప్రత్యేక ఫోకస్.
ఇదిలా ఉండగా.. అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ తో సుకుమార్ కు సంబంధం ఉందని టాక్ నడించింది. తను మరెవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. అప్పట్లో వీరిద్దరూ “100% లవ్” సినిమా చేస్తున్నప్పుడు ఈ వార్తలు గట్టిగా వినిపించాయి. ఇక ఈ సినిమాలో తమన్నా అందాలను ఆణువణువూ ఎలా చుపించాడో, ఎక్స్ పోజింగ్ చేయించాడో మనకు బాగా తెలుసు. ముఖ్యంగా తమన్నా “బొడ్డు, నడుము” అందాలను ఈ మూవీలో ఎక్కువ ఫోకస్ చేసాడని టాక్ నడించింది.

 

అయితే అంతకు ముందు ఏ సినిమాలో చూపనంత అందాలను తమన్నా.. ‘100% లవ్’ లో చూపించింది. సుకుమార్‌ కు తను బాగా కనెక్ట్‌ అవ్వడం వల్ల ఇదంతా జరిగిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుకుమార్‌ సినిమాల్లో కూడా తమన్నా కనిపించలేదు. దీనితో ఇవన్నీ వట్టి రూమర్లే అని తేలిపోయింది. వారిద్దరూ ఆ తర్వాత ఎప్పుడు కలిసి కనిపించలేదు. కావున ఇవన్నీ ఉట్టి పుకార్లే అని ఫిక్స్ అయ్యారు సినీ జనాలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -