Tarak: ఆ విషయంలో తారక్ నమ్మకం నిజమవుతుందా?

Tarak: తెలుగు వాడికి ప్రత్యేక గుర్తింపు సాధ్యమైంది ఒక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వల్లే అన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. మద్రాసీలు అనే పేర్లను తెలుగు జనాల నుండి దూరం చేసిన ఎన్టీఆర్.. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం, దానిని అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి తీసుకురావడం ఇప్పటికే చరిత్రలో కీలక ఘట్టాలు.

 

ప్రస్తుతం నందమూరి కుటుంబం నుండి రాజకీయాల్లో నందమూరి బాలయ్య ఉన్నాకానీ సమర్థవంతంగా, తెలుగుదేశం పార్టీని ప్రభావితం చేసే స్థాయిలో లేరు. ఓ పక్క చంద్రబాబు నాయుడు హవా తగ్గడం, లోకేష్ సామర్థ్యం మీద నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో నందమూరి నట వారసుడిగా ఉన్న తారక్.. రాజకీయాల్లోకి కూడా రావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలాకాలంగా దీనిపై చర్చ సాగుతోంది.

 

తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ చేపడితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. చంద్రబాబు నాయుడు వయసు మీద పడుతుండటంతో పాటు జగన్ జోష్ ను లోకేష్ తట్టుకోలేకోవడం లాంటి అనేక కారణాలు ఇందుకు సహకరిస్తున్నాయి. ఇక తెలంగాణలో ఒకప్పుడు హవా నడిపించిన తెలుగుదేశం పార్టీ పేరు ఇప్పుడు నామరూపాలు లేకుండాపోయింది.

 

ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం ఒక్క ఎన్టీఆర్ వల్లే అనే చర్చ సాగుతోంది. అయితే ఆసక్తికరంగా ఎన్టీఆర్ తాను ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నానని పలుసార్లు వెల్లడించాడు. అయితే తాను రాజకీయాల్లోకి వస్తే మాత్రం సీఎం అవుతాననే నమ్మకం ఎన్టీఆర్ లో బలంగా ఉందని సన్నిహితులు అంటున్నట్లు సమాచారం. రాబోయే పది సంవత్సరాల వరకు సినీ కెరీర్ మీదే ఫోకస్ పెట్టి ఆ తర్వాత పాలిటిక్స్ మీద ఫోకస్ చేయాలని తారక్ అనుకుంటున్నాడని తెలుస్తోంది. మొత్తానికి తారక్ పొలిటికల్ ఎంట్రీ మీద ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా.. రాబోయే సంవత్సరాల్లో మాత్రం ఉండే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -