Ram Charan: స్టార్ కావడం కోసం చరణ్ కష్టం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ram Charan: మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా రామ్‌ చరణ్‌ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అయితే, వంశపారంపర్యంగా ఎదుగుతున్నాడనే ఆరోపణలను రామ్‌ చరణ్‌ తన వ్యక్తిగత ప్రతిభతో తిప్పికొడుతున్నాడు. కేవలం ఎంట్రీ పాస్‌గా మాత్రమే వారసత్వాన్ని అందుకున్నాడు రామ్‌ చరణ్‌. తర్వాత సినిమాల్లో తనదైన మార్క్‌తో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. హిట్‌ సినిమాలురావడానికి చరణ్‌ పడుతున్న శ్రమ సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.

 

మెగాస్టార్‌ తనయుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు రామ్‌ చరణ్‌. చిరంజీవి పైకి రావడానికి ఎంత కష్టపడ్డాడో రామ్‌ చరణ్‌ కూడా చాలా వరకు కష్టంతోనే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. అందుకు నిరద్శనంగా అనేక చిత్రాలు వచ్చాయి. కాలానుగుణంగా తన నటన, ప్రవర్తన, సినిమాల్లో నటించేందుకు తన శ్రమ.. ఇలా అన్నింటినీ మార్చుకుంటూ ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రామ్‌ చరణ్‌.

 

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టంతోకూడుకున్న పని. అనేక మంది స్టార్లు ఒకటి రెండు సినిమాల్లో కనిపించి తర్వాత మాయమైపోయిన సందర్భాలు కూడా అనేకం చూస్తున్నాం. ఈ తరుణంలో రేయింబవళ్లు సినిమానే ప్రాణంగా భావించి దాని కోసం కష్టపడటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో రామ్‌ చరణ్‌ పట్టుదల, నిబద్ధత కనబరుస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

 

గుర్రపు స్వారీ సమయంలో కఠిన శ్రమ..
రామ్‌ చరణ్‌ నటించే పాత్రలు కాస్త భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా మెగాస్టార్‌ అంతటి ఇమేజ్‌ రామ్‌ చరణ్‌లో అభిమానులు చూసుకుంటారు కాబట్టి.. ప్రతి అడుగులోనూ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రామ్‌ చరణ్‌ రేయింబవళ్లు కష్టపడ్డారట. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. స్టార్‌గా ఎదగడం కోసం నిద్రలేని రాత్రులు గడిపాడట. బాగోలేని దుస్తులు ధరించి, డైలాగ్స్‌ను చరణ్‌ ప్రాక్టీస్‌ చేసే వారని తెలుస్తోంది. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే సమయంలో ఎంతో కఠినంగా కష్టపడ్డారని భోగట్టా. ఇంత శ్రమ చేశాడు కాబట్టే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్‌ హీరోల్లో ఒకడిగా ఉన్నాడని అభిమానులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -