Salaar: చొక్కా విప్పబోతున్న ప్రభాస్.. అలా కనిపిస్తారా?

Salaar: తెలుగు సినిమా స్థాయిని, తెలుగు హీరో స్థాయిని భారీగా పెంచేసిన సినిమా ‘బాహుబలి’. రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన డార్లింగ్ ప్రభాస్.. సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపును తెచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎవరూ చూపించనంత వైలెంట్ గా ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో చూపించబోతున్నాడనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. కేజీఎఫ్ తో వేరే లెవల్ హీరోయిజాన్ని చూపించిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ను పీక్స్ లో చూపిస్తాడనే ప్రచారం నడుస్తోంది. అందుకే సలార్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రశాంత్ నీల్, ప్రభాస్ లు చేస్తున్న ‘సలార్’ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ అభిమానులను ఊపేస్తోంది. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ ఓ ప్రయోగం చేయబోతున్నాడని.. అది ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అదేంటంటే.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేయించే ఓ ఫైట్ సీన్ లో స్క్రీన్ మీద ప్రభాస్ ను చూపించే విధానం.

ప్రభాస్ కటౌట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ప్రభాస్ ను ఫైట్ సీన్లలో వేరే లెవల్ లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడని.. చొక్కా విప్పేలా చేసి, సముద్రంలో ప్రభాస్ ఫైట్ చేస్తాడని సమాచారం. ఈ ఫైట్ సీన్ ప్రేక్షకుల మతిపోగొడుతుందని.. ప్రభాస్ ను చొక్కా లేకుండా ఫైట్ చేయడం చూస్తే వేరే లెవల్ లో ఉంటుందనే వార్త ఇప్పుడు అందరినీ ఊపేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -