Nagarjuna: ఆ ఇద్దరు హీరోయిన్లతో నాగార్జునకు ఎఫైర్లు ఉన్నాయా?

Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోహీరోయిన్లు నిజంగా మంచి జోడిగా ఉంటారు. చూడచక్కని ముచ్చటైన జంటగా జనాల మెదళ్లలో ఉండిపోతారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, క్యూట్ కపుల్ లాంటి హీరోహీరోయిన్ జంటలు ఎప్పటి నుండో ఉన్నాయి. సీనియర్ హీరోలు కూడా కొందరు కుర్ర హీరోయిన్లతో జతకడితే ప్రేక్షకులు వారిని విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు.

అలా ముందు తరం వారిలో నాగార్జున, టబు జోడీ అంటే సినీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ అనేది ఉండేది. అయితే టబుతో తనకు ఉన్న రిలేషన్ గురించి నాగార్జున చాలా సార్లు చెప్పుకొచ్చాడు. టుబునే కాదు అనుష్క అంటే కూడా నాగ్ పలుమార్లు తెలిపాడు. ఈ ఇద్దరి హీరోయిన్లంటే నాగ్ కు ప్రత్యేక అభిమానమని, వీరితో నాగ్ కు ఎఫైర్లు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో అనేక వార్తలు షికారు చేశాయి. దీనిపై వస్తున్న వార్తలకు నాగార్జున కొన్నిసార్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.

నాగార్జున, టబు కలిసి చేసింది రెండు సినిమాలే అయినా అందులో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున, టబుల కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ నాగ్ వాటిని కొట్టిపారేస్తూ వచ్చారు.

జీవితంలో సగం కాలం నుండి తమ స్నేహం కొనసాగుతోందని నాగ్ తెలిపాడు. ఆ తర్వాత హీరోయిన్ అనుష్కను తెలుగు తెరకు పరిచయం చేసింది నాగార్జుననే. ఆయనంటే అనుష్కకు కూడా చచ్చేంత ఇష్టం. సూపర్ సినిమాలో అనుష్క పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత డాన్ సినిమాలో కూడా నాగ్ అనుష్కతో జతకట్టారు. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా సినిమాల్లో చాాలా బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. మొత్తానికి టబు, అనుష్కతో నాగ్ కు ఎఫైర్ ఉందని వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. టబు, అనుష్కతో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని నాగ్ పలు సందర్భాల్లో చెప్పినా ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -