Jayasudha: ఆ రీజన్ వల్లే జయసుధ రెండో పెళ్లి చేసుకుంటున్నారా?

Jayasudha: పెళ్లి విషయంలో చాలా మంది ఆలోచన ధోరణి మారుతోంది. పెళ్లికి వయసుతో సంబంధం లేదని, మనసుతోనే పని అని ఇప్పుడు చాలా మంది చెబుతూ వస్తున్నారు. మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోవడానికి వయసు అడ్డురాదంటూ చాలా మంది నటీనటులు లేటు వయసులోనూ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఘాటు ప్రేమలో పడి ఆరు పదుల వయసులోనూ హుషారుగా పెళ్లి చేసుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల నటీనటులు వారి జీవిత భాగస్వామిని కోల్పోతూ ఒంటరిగా బతుకుతున్నారు. అలాంటి వారు కూడా మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు వయసు పైబడిన తర్వాత కూడా వివాహం చేసుకుంటున్నారు. తాజాగా మరొక నటి కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా పేరు పొందిన జయసుధ అనేక అద్భుతమైన సినిమాల్లో నటించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆమె తన భర్తను కోల్పోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. ఈ తరుణంలోనే జయ సుధ రెండో పెళ్లిపై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఒంటరితనాన్ని భరించలేక జయసుధ రెండో పెళ్లికి సిద్ధమైందంటూ ఆ వార్తలు వైరల్ కావడంతో వాటిపై జయసుధ స్పందించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు జయసుధ తెలిపారు.

తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని, ఇప్పుడు తాను ఒంటరిగానే సంతోషంగా జీవిస్తున్నానని జయసుధ క్లారిటీ ఇచ్చారు. నటన పరంగా తనకు వరుస అవకాశాలు వస్తున్నాయని, ఆ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాని అన్నారు. తన రెండు పెళ్లి వార్తలు పూర్తి అవాస్తమని, వాటిని ఎవ్వరూ నమ్మవద్దని జయసుధ తెలిపారు. సోషల్ మీడియాలో తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -