Samantha: ఆ వ్యక్తినే సమంత పెళ్లి చేసుకోనున్నారా?

Samantha: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సమంత పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె టాప్ పొజిషన్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దానికి సంబంధించి ఆమె చికిత్స తీసుకుంటోంది. త్వరలోనే తన తదుపరి సినిమా అయిన ఖుషి సెకండ్ షెడ్యూల్ లో ఆమె ఎంటర్ కానుంది. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమంత అక్కినేని నాగచైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని విభేదాల కారణంగా వారు విడాకులు తీసుకుని విడిపోయారు. వారు విడాకులు తీసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వారికి చెందినది హల్ చల్ చేస్తూనే ఉంది. తాజాగా సమంత రెండో పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

మరి ముఖ్యంగా సమంతను ఓ యంగ్ హీరో ఆమెను దగ్గరుండి చూసుకుంటు ఉన్నాడని, మొదటి నుంచి సమంత అంటే ఆ హీరోకి క్రష్ అని, ప్రస్తుతం ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత మాత్రం అతనిపై అలాంటి ఫీలింగ్ లేదంటూ తెలిపింది.

అంతేకాదు సమంత సోషల్ మీడియాకి దూరమవ్వాలనే నిర్ణయం కూడా ఆ వ్యక్తి తీసుకున్నదేనని, సమంతపై నెగటివ్ కామెంట్స్ భరించలేక అలాంటి నిర్ణయం తీసుకోమన్నాడని సమాచారం. అతను చెప్పిన మాట వింటున్నా సమంత మాత్రం అతనితో రెండో పెళ్లి చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదట. కానీ ఆ వ్యక్తి మాత్రం సమంతని పెళ్లి చేసుకుంటానని భీష్మించుకొని కూర్చున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఉందో లేదోనని తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం సమంత రెండో పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -