Vijay: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్.. ఏమైందంటే?

Vijay: తమిళ హీరో ఇలయ దళపతి విజయ్ హీరోగా వారసుడు అనే సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగులో కూడా భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. జనవరి 11వ తేదిన వారసుడు విడుదల కానుంది. ఇదిలా ఉండగా విజయ్ గురించి ఒక షాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు తమిళనాడుతో పాటు ఇటు సౌత్ మొత్తం కూడా ఈ వార్త హల్ చల్ చేస్తోంది. హీరో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి విడిపోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

తాజాగా ఇది వైల్డ్ ఫైర్ లాగా రూమర్స్ వ్యాపిస్తోంది. దీంతో విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే విజయ్, సంగీత గురించి వచ్చిన ఈ న్యూస్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. విజయ్ సన్నిహిత వర్గాలు ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యారు. అసలు ఈ రూమర్లు ఎందుకు మొదలయ్యాయో కూడా అర్థం కావడం లేదని, ఈ పుకార్లు పూర్తిగా అవాస్తవం అని వారు తేల్చి చెప్పారు.

ఈ మధ్యకాలంలో చెన్నైలో వారసుడు ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ భార్య సంగీత హాజరు కాకపోవడం, అలాగే దర్శకుడు అట్లీ సతీమణి సీమంతం వేడుకలో కూడా ఆమె కనిపించకపోవడంతో విజయ్, సంగీతల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

సంగీత ప్రస్తుతం తన పిల్లలు, కుటుంబీకులతో యూఎస్ వెకేషన్ లో ఉంది. అందుకే ఆమె ప్రీరిలీజ్ వేడుకకు హాజరు కాలేదని కొందరు అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ రూమర్స్ విజయ్ ఫ్యాన్స్ ని బాగా కంగారు పెట్టాయని అనిపిస్తోంది. విజయ్, సంగీతలు 1999లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. ప్రస్తుతం వీరి వైవాహిక జీవితం సంతోషంగానే సాగుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -