Star Heroes: డైరెక్టర్లే హీరోలైతే స్టార్ హీరోలకు ఇబ్బందేనా.. అసలేం జరిగిందంటే?

Star Heroes: కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ సంగీత దర్శకుడు అనిరుధ్‌ నటులుగా మారనున్నారా అంటే సినీ వర్గాలలో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం ప్రస్తుతం సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఇద్దరిని హీరోలుగా పరిచయం చేసే బాధ్యతను స్టంట్‌ కొరియోగ్రఫీ ద్వయం అన్బు-అరివు తీసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇదే విషయంపై సోషల్‌ మీడియాలోకూడా చర్చ మొదలైంది. తమిళం, తెలుగులో లోకేశ్‌, అనిరుధ్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అన్బు- అరివు తెలుగు తమిళ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారట.

కాగా ఇది యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి. అయితే గతంలో, రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో దుర్గ సినిమాని ప్రకటించారు అన్బు- అరివు. కానీ ఆ ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు ఎటువంటి అప్‌డేట్‌ లేదు.కథలు వేరైనా వాటిల్లోని పాత్రలను లింక్‌ చేస్తూ సినిమాటిక్‌ యూనివర్స్‌ని క్రియేట్‌ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతున్నారు లోకేశ్‌. ఖైదీ మినహా లోకేశ్‌ తెరకెక్కించి ఇతర సినిమాలకు అనిరుధ్‌ సంగీతం అందించి, వాటి విజయాలకు ఒక కారణంగా నిలిచారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -