Naresh: నరేష్ అలాంటి వీడియోలు చూస్తాడు. రమ్య సంచలన వ్యాఖ్యలు!

Naresh: సినీ ఇండస్ట్రీలో కొందరు వరుసగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మరికొందరు కొన్ని రకాల వివాదాలతో నిలుస్తుంటారు. తాజాగా సీనియర్ నటుడు నరేశ్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. గత కొన్ని రోజులు ముందు ఆయన తన సహాయ నటి పవిత్రా లోకేశ్ తో కిస్ చేస్తూ ఓ వీడియోను వదిలారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా నరేశ్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 

తన వైవాహిక జీవితంలో తప్పులన్నీ నరేశ్ చేసి తనపై లేనిపోని నిందలు పోయాడని, భరించలేని ద్రోహం చేశాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ స్టార్ కృష్ణతో తనకు వివాహేతర సంబంధాన్ని నరేశ్ అంటగట్టి చాలా రకాలుగా వేధించాడని రమ్య రఘుపతి ఆరోపించింది. తన భర్త తనను అలా చేసిన దానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. దేవుడిలాంటి కృష్ణగారి ఇంటి ప్రతిష్ట, మర్యాదలను చూసి తాను మౌనం వహించానని, లేకుంటే ఈ పాటికి నరేశ్ ను రోడ్డుకు ఈడ్చుండేదానినని తెలిపారు.

 

ఇన్ని రోజులూ తాను ఆ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేక తనలో తానే సతమతమైపోయానని తెలిపారు. నరేశ్ చేసే దారుణాలు ఎక్కువవుతున్నాయని, అందుకే అందరికీ నిజం చెప్పాల్సిన తరుణం వచ్చిందని అన్నారు. తనను ఇంట్లో నుంచి నరేశ్ వెల్లగొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేశాడని, కృష్ణతో వివాహేతర సంబంధం ఉందని చెప్పిన తనను మానసికంగా టార్చర్ చేశాడని రమ్య తెలిపింది.

 

తండ్రి స్థానంలో ఉన్న కృష్ణతో తనకు వివాహేతర సంబంధం అంటగట్టడం నరేశ్ దారుణాలకు పరాకాష్ట అని రమ్య వెల్లడించారు. తనను ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేసి ఇప్పుడు తాను మాత్రం మంచి వాడిలా నటిస్తున్నాడని, పవిత్ర లోకేశ్ తో ఇలా వీడియోలు చేసి రిలీజ్ చేయడం నిజంగా సిగ్గుచేటని అన్నారు. నరేశ్ అస్లీల వీడియోలు చూస్తాడని, తన కొడుకు కూడా తండ్రి అలా చేయడం చూశాడని తెలిపారు. సమాజంలో ఇటువంటి వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ నరేశ్ దారుణాలు తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుందని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -