Rashmika Mandanna: అయ్యో.. రష్మిక కోరికలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Rashmika Mandanna: నేషనల్‌ క్రష్‌గా పిలిపించుకున్న రష్మిక.. ప్రస్తుతం తనదైన మార్కెట్‌తో ఇండస్ట్రీని దున్నేస్తోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్‌ సరసన నటించిన పుష్ప మూవీతో బాలీవుడ్‌ రేంజ్‌కు చేరుకుంది రష్మిక. వరుస సినిమాలతో రెమ్యునరేషన్‌ను కూడా పెంచేసిందని వార్తలు వెలువడ్డాయి. అయితే, రష్మిక తరచూ వివాదాల్లోనూ చిక్కుకుంటోంది. రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌ మెంట్‌ మొదలుకొని.. మొన్నటికి మొన్న బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన కాంతార మూవీని చూడలేదని చెప్పడం సహా అనేక వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి.

 

రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌ మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకున్న తర్వాత ఆమె కెరీర్‌ మరింత దూసుకెళ్లింది. మంచి మూవీలతో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. తాజాగా కాంతార మూవీని తాను చూడలేదని చెప్పడంతో పెద్ద దుమారం రేగింది. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్‌ చేయాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. తర్వాత క్షమాపణ కోరడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇలా తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది రష్మిక. టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండతో ప్రేమాయణం కూడా నడుపుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన ఆమె గీత గోవిందం సినిమాలో నటించింది. ఈ మూవీ బంపర్‌ హిట్‌ కొట్టింది. తర్వాత ఆమె కెరీర్‌ మరో స్థాయికి వెళ్లింది. తర్వాత మరో మూవీ డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలోనూ వీరిద్దరూ జతకట్టారు. అనంతరం ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన లైగర్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో విజయ్‌, రష్మిక ఇద్దరూ మాల్దీవులకు టూర్‌ వెళ్లారని టాక్‌ నడిచింది.

 

వారిద్దరితో మూవీ చేయాలని ఉంది..
తాజాగా రష్మిక తమిళ హీరో విజయ్‌ సరసన నటించిన వారసుడు మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతోంది. ఈచిత్రం సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. తెలుగులో ప్రభాస్‌, రామ్‌ చరణ్‌ సరసన ఒక్కసారైనా మూవీ చేయాలని ఉందంటూ తన మనసులో మాట చెప్పింది. ఇప్పటి వరకు తెలుగులో వారితో చేయలేదని, అవకాశం వస్తే సంతోషిస్తానంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -