Tamil Nadu: ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు.. చివరికి?

Tamil Nadu: ఇటీవల కాలంలో యువత ప్రేమ అనే మాయలో పడి వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించిన యువతి కాదనిందని ఆత్మహత్య చేసుకోవడం లేదంటే ఆమెను చంపడం, ప్రేమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎక్కువగా ఈ ప్రేమ అనే వాటి వల్ల ఆడపిల్లను బలవుతున్నారు. రాను రాను ఆడపిల్లలు బయటికి రావాలి అంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఒక యువకుడు ప్రేమించిన యువతి పెళ్లికి కాదనిందని దారుణానికి వడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

19 ఏళ్ల పూజ అనే యువతీ తన బంధువులతో కలిసి తమిళనాడు రాష్ట్రం, తిరుప్పూరు జిల్లా రాయర్ పాళయంలో నివాసం ఉంటోంది. పూజా సమీపంలోని బనియన్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. అయితే అదే ఫ్యాక్టరీలో రాయర్ పాళయంకు చెందిన గుణశేఖరన్ కుమారుడు లోకేష్ అనే 22 ఏళ్ల యువకుడు కూడా పనిచేస్తున్నాడు. ఒకే చోట పనిచేస్తుండడంతో పూజ, లోకేష్ ల మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అలా వారిద్దరు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరోజు పూజా ని పెళ్లి చేసుకుందామని లోకేష్ అడిగాడు. పెళ్లి చేసుకుందామని అడగగా అందుకు యువతి పూజ నిరాకరించడంతో పాటు అతని కొంతకాలం నుంచి దూరం పెడుతోంది.

 

ఈ క్రమంలోనే తాజాగా పూజాతో మాట్లాడాలి అని ఆమెను పనపాళయం కు పిలిపించాడు. ఇలా అయిన ఆమెను చంపాలి అనుకున్న లోకేష్ ప్లాన్ ప్రకారం ముందే తెచ్చుకున్న పెట్రలో తో పూజ కోసం లోకేష్ ఎదురు చూశాడు. ఈ క్రమంలోనే పూజ అక్కడి రావడంతో వారిద్దరి మధ్య పెళ్లి విషయంలో మరోసారి చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే లోకేష్ పూజపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి మోటరు సైకిల్ పై తప్పించుకుని వెళ్లే సమయంలో లోకేష్ జారి కిందపడ్డాడు. అప్పుడు లోకేష్ కి దెబ్బలు తగిలాయి. అక్కడికి చేరువలో పూజ మంటల్లో నొప్పికి అల్లాడుతూ ఉండగా స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు పూజ చికిత్స పొందుతూ మరణించింది. ఇక లోకేష్ కు తీవ్ర గాయాలు అవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును చేపట్టగా దీనికి మూల కారణం లోకేష్ అని తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -