Tamil Nadu: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అలా చేస్తామంటూ?

Tamil Nadu: ఒకప్పుడు అన్ని దానాలలో కెల్లా అన్నదానం ఎంతో గొప్పది అని చెప్పేవారు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపితే అది మహా భాగ్యం అని చెప్పేవారు. ప్రస్తుత కాలంలో అన్ని దానాలలో కెల్లా అవయవ దానం ఎంతో గొప్పదని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వారి శరీరంలోని అవయవాలను కోల్పోతున్నారు.

ఇక చాలామంది బ్రెయిన్ డెడ్ కారణంగా చనిపోతూ మరికొందరికి ప్రాణదానం చేస్తున్నటువంటి సంఘటనలను మనం చూస్తున్నాము. ఈ విధంగా ఎంతోమంది నిస్వార్థంతో తమ ఆత్మీయులు చనిపోయిన మరొకరికి ప్రాణదానం చేయాలన్న ఉద్దేశంతో చనిపోయిన వారి అవయవాలను ఇతరులకు దానం చేస్తూ మరొకరీ జీవితంలో వెలుగు నింపుతున్న సంగతి మనకు తెలిసిందే.

క్రీడాకారులు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా ప్రజలలో అవయవ దానాన్ని ప్రోత్సహిస్తూ అందరిలోనూ అవగాహన కలిగిస్తున్నారు. ఇలా అవయవ దానంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానంలో తమిళనాడు ఉంది. ఈ క్రమంలోనే ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది.

ఎవరైతే స్వచ్ఛందంగా అవయవ దానం చేయడానికి ముందుకు వస్తారో వారు అంత్యక్రియలను అధికారక లాంచనాలతో నిర్వహిస్తామని ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. ప్రజలందరూ నిస్వార్థంతో అవయవనాలు దానం చేయడానికి ముందుకు రావడంతోనే మన దేశంలో తమిళనాడు రెండో స్థానంలో ఉందని ఈయన కొనియాడారు అయితే ఈ విషయంపై మరింత అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఇలా స్వచ్ఛందంగా అవయవ దానం చేసిన వారి అంత్యక్రియలను అధికారక లాంచనాలతో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -