MP Ganeshamurthi: టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ.. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

MP Ganeshamurthi: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి నెలకుంది పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నేతలందరూ ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తమకు టికెట్ వస్తుందా రాదా అన్న అయోమయంలో ఉండగా రానటువంటి వారు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఉన్నారు.

ఏ పార్టీ నుంచి అయినా తమకు టికెట్ రాలేదు అంటే వేరే పార్టీలోకి చేరడం లేదంటే ఆ పార్టీపై విమర్శలు చేయడం చేస్తాము ఇక మనకు స్తోమత ఉంటే స్వతంత్రంగా పోటీ చేస్తాము లేదంటే ఇంట్లో ఉండిపోతాము కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు ఎంపీ టికెట్ రాలేదు అంటూ ఏకంగా పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

తమిళనాడుకు రాష్ట్రం ఈరోడ్‌ నియోజకవర్గానికి గణేశ మూర్తి(74) ఎండీఎంకే పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. ఎండీఎంకే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గణేశమూర్తికి టికెట్ రాకపోవడంతో ఈయన మనస్థాపానికి గురయ్యారు.

ఇలా టికెట్ రాకపోవడంతో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక.. బయటకీ చెప్పుకోలేక గణేశ లోలోపలే మదనపడ్డారు. చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తాను పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈయన ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -