NTR: జూనియర్ ఎన్టీఆర్ భారత్ కే ప్రధాని కాబోతున్నారా?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు తెర మీద తన సినీ ప్రస్థానాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్న తారక్.. ‘ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఆ మధ్యన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.

 

నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని నందమూరి వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ హస్తగతం చేసుకోవాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. అవసరమైనప్పుడు రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తానంటూ ఎన్టీఆర్ కూడా చాలాసార్లు తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నిరాశాజకంగా సాగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పార్టీని ముందుండి నడిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

 

సినిమా రంగంలో ప్రస్తుతం ఎన్టీఆర్ పీక్ స్టేజ్ లో కొనసాగిస్తున్న నేపథ్యంలో.. కేవలం సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేయాలని, రాజకీయాల గురించి మాత్రం ఆలోచించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ తరుణంలోనే ఎన్టీఆర్ జాతకానికి సంబంధించిన ఓ విషయం అందరినీ ఆకర్షిస్తోంది. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఎలా ఉంటుందనే విషయం మీద ఆ వార్త అటు రాజకీయ వర్గాలను, సినీ వర్గాలను చర్చించుకునేలా చేస్తోంది.

 

జూనియర్ ఎన్టీఆర్ జాతకరిత్యా అతడు ఏ పని చేసినా సక్సెస్ అవుతాడని ఉందట. అలాగే అతడి జాతకంలో ప్రధానమంత్రి అయ్యే యోగం ఉందనే వార్త అందరిలో ఆసక్తిని పెంచింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం 2049 నాటిని భారతదేశానికే ప్రధానమంత్రి అయ్యేంత బలమైన జాతకం కలిగి ఉన్నాడట. నందమూరి అభిమానులకు, టీడీపీ అభిమానులకు ఈ వార్త ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుండగా.. ప్రస్తుతానికి ఎన్టీఆర్ మాత్రం సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించడం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -