Keerthy Suresh-Ram Charan: కీర్తి సురేష్‌లో ఏం తక్కువ? చరణ్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు?

Keerthy Suresh-Ram Charan: మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ వివిధ భాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే మహానటి సినిమాలో తన నటనకు జాతీయస్థాయి పురస్కారం కూడా అందుకుంది. అయితే తెలుగులో కీర్తి సురేష్‌కు స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదు. గత ఏడాది మహేష్‌బాబు సరసన సర్కారువారి పాట సినిమాలో కీర్తి సురేష్ నటించి మెప్పించింది. ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా కీర్తి సమర్ధవంతంగా పోషించింది.

 

అయితే ఇతర యంగ్ హీరోలు కీర్తి సురేష్‌ను పట్టించుకోవడం లేదు. దీనికి చాలా మంది ఓ కారణాన్ని చూపిస్తున్నారు. మహానటిలా నటించిన కీర్తి ఎక్స్‌పోజింగ్ అండ్ గ్లామర్ పాత్రలు చేస్తే చూడలేకపోతున్నాయని కామెంట్ చేస్తున్నారు. దీంతో పలువురు హీరోలు ఆమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అంతేకాకుండా కీర్తి సురేష్‌లో సెక్సీ లుక్స్ లేవని.. కేవలం ట్రెడిషనల్ లుక్స్ మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

 

నిజానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో చరణ్‌కు జోడీగా కీర్తి సురేష్‌ను తీసుకోవాలని భావించారట. కానీ కీర్తి గ్లామర్‌పై నమ్మకం లేకపోవడంతో చిత్ర యూనిట్ పూజాహెగ్డేను తీసుకునేందుకు మొగ్గు చూపిందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఫోటో షూట్లలో తన అందచందాలతో రెచ్చిపోతున్న కీర్తిని హీరోలు మాత్రం పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోంది.

 

కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల చిన్ని మూవీలో బోల్డ్ నటనతో కీర్తి సురేష్ విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. త్వరలో తెలుగు దర్శకులు కీర్తిలోని టాలెంట్‌ను గుర్తించి స్టార్ హీరోల సరసన అవకాశాలు ఇస్తారో లేదో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -