Varasudu: విజయ్ కి తెలుగులో అంత వస్తేనే ‘వారసుడు’ గట్టెక్కుతుందా?

Varasudu: తమిళ హీరో విజయ్ తెలుగులో డైరెక్ట్ గా చేస్తున్న మొదటి సినిమా ‘వారసుడు’. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఈ సినిమా చేస్తుండగా.. ఈ సినిమాను ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదలకు నిర్మాత సిద్ధమైపోయాడు. తెలుగులో బడా నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా ఉండగా.. సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాల పోటీని తట్టుకొని విజయ్ ‘వారసుడు’ నిలవాల్సిన అవసరం ఉంది.

 

విజయ్ ‘వారసుడు’ సినిమా నైజాంలో రూ.6కోట్లు, ఆంధ్రాలో రూ.8కోట్లు, సీడెడ్ లో రూ.2కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.16కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు మొత్తంగా అమ్మేసి టేబుల్ ప్రాఫిట్ లోనే ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.17కోట్లు అందుకుంటేనే సక్సెస్ అయినట్లు అవుతుంది.

 

సంక్రాంతి బరిలో ఇద్దరు లోకల్ హీరోలైన చిరంజీవి, నందమూరి బాలయ్య సినిమాలను తట్టుకొని విజయ్ సినిమా రూ.20కోట్ల వైపు దూసుకెళితేనే సినిమా సక్సెస్ అయినట్లు అవుతుంది. అయితే మాస్ జనాలనే టార్గెట్ గా చేస్తూ అటు చిరంజీవి, ఇటు నందమూరి బాలయ్యలు సినిమాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో విజయ్ కు ఇది కష్టమే అని చెప్పాలి. గతంలో విజయ్ సినిమాలు ఏవీ ఈ రేంజ్ కలెక్షన్లను సాధించలేదనేది వాస్తవం.

 

వంశీ పైడిపల్లి, విజయ్ కాంబోలో వస్తున్న ‘వారసుడు’ సినిమా ట్రైలర్ టాక్ కాస్త మిక్స్ డ్ గా ఉండటం కూడా సినిమా మీద ప్రభావం చూపబోతోంది. మాస్ జనాలను అలరించడానికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’లుగా వస్తున్న నేపథ్యంలో ఆ పోటీని తట్టుకొని విజయ్ ‘వారసుడు’ నిలవాల్సిన అవసరం ఉంది. సంక్రాంతి బరిలో ఇద్దరు లోకల్ హీరోల బడా చిత్రాల మధ్య విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -