Balayya: రాజమౌళి డైరెక్షన్లో.. క్రూరమైన విలన్ గా బాలయ్య?

Balayya: చెంగిజ్ ఖాన్ ఇప్పుడు ఫిలిం నగర్లో మార్మోగుతున్నా పేరు. ఈ పేరు వింటానికే కొత్తగా వింతగా ఉంది కదా. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ ఒంగోలు ప్రాంతం గురించి మాట్లాడుతూ చెంగిజ్ ఖాన్ సినిమా చేయడం నా జీవిత ఆశయం అని చెప్పాడు. సరైన సమయం వచ్చినపుడు ఖచ్చితంగా ఆ సినిమా చేస్తాను అని ప్రకటించడంతో బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రియులు చెంగిజ్ ఖాన్ గురించి తెలుసుకునే పనిలో పడ్డారు.

 

అసలు ఎవరు ఈ చెంగిజ్ ఖాన్ అంటే.. ఈశాన్య ఆసియాలోని సంచార జాతికి చెందిన వాడు. ప్రపంచంలోనే మంగోల్ సామ్రాజాన్నిస్థాపించిన ఇతని అసలు పేరు టెమూజిన్. మంగోల్ సామ్రాజ్య విస్తీరణ కోసం ఎన్నో రాజ్యాలపై దండయాత్రలు చేసినట్టు తెలుస్తుంది. దండయాత్ర సమయంలో అక్కడి ప్రజలపై అతని సైన్యం క్రూరంగా ప్రవర్తించేది.. మహిళపై ఆత్యాచారం చేసి వారితో తీస్కువెళేవారు అంట. వీరి దారుణాలు భరించలేక రాజులూ సామంతులుగా మారిపోయారు అనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిపై సరైన ఆధారాలు మాత్రం ఎక్కడ లభించలేదు.

 

ఇంతటి క్రూరత్వం మనస్తవత్వం ఉన్న చెంగిజ్ ఖాన్ జీవిత చరిత్రపై సినిమా తీయాలని బాలయ్య ప్రకటించడం అందరిని షాక్ కు గురి చేసింది. ఈ సినిమా ఎలా తీస్తారు? సినిమాలో చెంగిజ్ ఖాన్ విలనిజం చూపిస్తారా? లేదా హీరోగా చూపిస్తారా? అసలు సినిమా ఎలా ఉండబోతుంది? దర్శకుడు ఎవరు? ఇలా రకరకాల ప్రశ్నలతో మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు..

 

ఇలాంటి చారిత్రక కథలను తీయాలి అంటే భారతదేశ నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌలికి మాత్రమే సాధ్యం అని.. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ మాటలు అందించాలని నెటిజన్స్ సోషల్ మీడియా లో తెగ పోస్ట్లు పెడ్తున్నారు. మరి బాలయ్య జీవిత ఆశయం లాంటి ఈ మూవీ ఎంత వరకు తెరకెక్కుతుందే వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -