Waltair Veerayya: వాల్తేరు వీరయ్య మైనస్ పాయింట్లు ఏంటో తెలుసా?

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతున్నాడు. సంక్రాంతి బరిలో దిగుతున్న ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో అచ్చంగా అలానే ట్రైలర్ అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉంది. అయితే ఈ ట్రైలర్ కు సంబంధించి కొంతమంది మాత్రం కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయని నెట్టింట చర్చకు తెర తీశారు. ఆ నెగిటివ్ పాయింట్లు ఏంటో చూద్దాం.

 

‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ లో ఎక్కువ శాతం యాక్షన్ కనిపించింది. అయితే చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అలాంటి చిరంజీవి కామెడీ ట్రాక్ ని కాస్త యాడ్ చేసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదనే టాక్ ఉంది. అదే సమయంలో సెంటిమెంట్ ని కూడా కాస్త పెంచి ఉంటే బాగుండేదని.. అదే ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ లో మైనస్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

ఇక ట్రైలర్ లో ఎక్కువగా డైలాగులు ఉండటం కూడా మైనస్ గా చెప్పుకుంటున్నారు. ట్రైలర్ లో ఉండాల్సిన మోతాదు కన్నా ఎక్కువ డైలాగులు పెట్టేశారని అంటున్నారు. కానీ చివర్లో డైలాగ్ మాత్రం బాగా పేలిందనే టాక్ ఉంది. అదే సమయంలో ట్రైలర్ చూస్తేనే సినిమా కథ ఏంటో అర్థమైపోయేలా ఉంది. కథను రివీల్ చేయకుండా ట్రైలర్ ని ఇంకా బాగా కట్ చేయాల్సిందనే టాక్ ఉంది.

 

ఇక ట్రైలర్ లో చిరంజీవి మార్క్ డ్యాన్స్ స్టెప్ ఒక్కటి కూడా కనిపించలేదు. సినిమా పాటలు ఇప్పటికే జనాల్ని ఊపేస్తున్న నేపథ్యంలో ఒక్క స్టెప్ అయినా పెట్టి ఉంటే వేరే లెవల్ ట్రైలర్ అయ్యేదనే టాక్ ఉంది. కాకపోతే స్టెప్స్ అన్నీ సినిమాలో వెండి తెర మీద చూడాలనే ఉద్దేశంతోనే ట్రైలర్ లో పెట్టలేదని అభిమానులు అంటున్నారు. అదే సమయంలో రవితేజ క్యారెక్టర్ గురించి గతంలో చూపించిన సీన్స్ నే మళ్లీ ట్రైలర్ లో చూపించారు. అలా కాకుండా రవితేజ క్యారెక్టర్ కు సంబంధించి వేరే సీన్లు చూపించి ఉంటే ట్రైలర్ వీర లెవల్ లో ఉండేదనే టాక్ ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -