Manchu Vishnu: విష్ణుకు అరవింద సమేత మూవీకి రిలేషన్ ఇదే!

Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు ఎవరంటే ఎవరైనా అనుమానం లేకుండా చెప్పే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన మార్క్ సినిమా కథతో కాకుండా పూర్తి ఫ్యాక్షన్ స్టోరీని, రక్తపాతంతో చూపించిన సినిమానే ‘అరవింద సమేత వీర రాఘవ’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపగా.. ఈ సినిమా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

 

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాకు, మంచు విష్ణు చేసిన ‘దూసుకెళ్తా’ సినిమాకు కొంతమంది నెటిజన్లు లింక్ పెడుతున్నారు. దీని కోసం విష్ణు సినిమాలోని ఓ కామెడీ సీన్ ని వాడుకుంటున్నారు. మంచు విష్ణు సినిమాలో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా కథను చెప్పారని అంటున్నారు. ఇంతకీ ఈ రెండు సినిమాలకు ఉన్న లింకేంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.

 

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో తన తండ్రిని చంపిన శత్రువుల తన వైలెన్స్ తో భయపెట్టి చివర్లో తన మాటల ద్వారా మార్చి తమ గ్రామాల్లో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తాడు ఎన్టీఆర్. అయితే ఈ స్టోరీ లైన్ ని మంచు విష్ణు సినిమాలోని ఓ కామెడీ సీన్ లో కమెడియన్ అలీ చెబుతాడు. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

 

‘దూసుకెళ్తా’ సినిమాలోని ఓ సీన్ లో అలీ కొందరికి ఒక కథ చెప్తూ..‘అశాంతిగా ఉన్న ఊరిని హీరో ప్రశాంతం గా మారుస్తాడు అని చెప్తాడు.. అప్పుడు అక్కడున్న ఒకడు ఎలా మారుస్తాడు అని అడగ్గా.. అందర్నీ ఇష్టమొచ్చినట్టు కొట్టి.. ఇలా.. కొట్టి చివరికి శాంతి వచనాలు చెప్పాలి’ అని అంటాడు. అంటే ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా కథను మంచు విష్ణు సినిమాలో చెప్పేశారు అని చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -