WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్?

WhatsApp: దేశవ్యాప్తంగా టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ ను నిత్యం లక్షలాదిమంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ వినియోగదారుల కోసం వాట్సాప్ సెమిస్టర్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో అయితే వాట్సాప్ ఎన్నో రకాల ఫీచర్లను తీసుకువచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే తీసుకురానుంది. ఆండ్రాయిడ్ డివైజ్‌ నుంచి వచ్చిన డేటాను మరో లోకల్‌ నెట్‌వర్క్‌తో పని చేస్తున్న డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. టెస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్ ద్వారా యూజర్లు తమ ఛాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. కాగా వాట్సాప్‌ చాట్‌ను బ్యాకప్‌ చేసుకోవడానికి ఇకపై గూగుల్ డ్రైవ్‌ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

అంతేకాకుండా యూజ‌ర్లు ఇక నుంచి గూగుల్ డ్రైవ్ వాడాల్సిన అవ‌స‌రం లేకుండా చేస్తుంది. ఒక డివైజ్ నుంచి మ‌రో డివైజ్‌కు ఛాట్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌నుకుంటే వారు బ్యాక‌ప్ కోసం క్లౌడ్ స‌ర్వీసుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండదు. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తమ డేటాను సులభంగా బ్యాకప్‌ పొందొచ్చు. ఇక వాట్సాప్‌ అంతకు ముందు ప్రాక్సీ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో ఏ సమయంలో అయినా వాట్సాప్‌ కనెక్షన్‌ బ్లాక్‌ అయితే, దాని పునరుద్ధరించుకునేందుకు యూజర్లకు అవకాశం కల్పించారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -