Mokshagna: అన్ స్టాపబుల్ షోలో మోక్షజ్ఞ అలా చేశారా?

Mokshagna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న స్టార్ హీరో ఎవరంటే టక్కుల అందరూ పవన్ కళ్యాణ్ పేరు చెబుతారు. సినిమా హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కు మరే హీరోకు లేనంత ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టే అతడు టాలీవుడ్ పవర్ స్టార్ అయ్యాడు. ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. సినిమా లేటుగా వచ్చినా ఇండస్ట్రీ రికార్డులు మొత్తం షేక్ అవ్వాల్సిందే.

 

కేవలం సినిమాల్లోనే కాదు, బయట ఎక్కడ కనిపించినా పవన్ కళ్యాణ్ ను చూడటానికి జనాలు ఎగబడుతుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ చాలా వరకు సినిమా ఫంక్షన్లకు, కార్యక్రమాలకు దూరంగా ఉంటాడు. కానీ ఈ మధ్యనే నందమూరి బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’కి అతిథిగా హాజరవడం సెన్సేషన్ అయింది. ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ఆహాలో ఈ ఎపిసోడ్స్ టెలీకాస్ట్ కానుండగా.. వీటిపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

సాధారణం ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే పవన్ కళ్యాన్.. ఇలా ఓ షో కోసం మొదటిసారి రావడం మీద సర్వత్రా ఆసక్తినెలకొంది. వ్యక్తిగత విషయాల దగ్గరి నుండి సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పవన్ కల్యాణ్ వివరించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ‘అన్ స్టాపబుల్2’ షూటింగ్ టైంలో సెట్ లో పవన్ కళ్యాణ్ ఉండగా ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

 

నందమూరి బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ త్వరలోనే వెండితెర మీద హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణంలో.. తన తండ్రి హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’కి గెస్టుగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఆశీర్వాదాన్ని మోక్షజ్ఞ తీసుకున్నాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నిండు మనసుతో స్టార్ హీరో కావాలని ఆశీర్వించినట్లు తెలుస్తోంది. దీంతో మోక్షజ్ఞ ఖచ్చితంగా స్టార్ హీరో అవుతాడంటూ నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -