Sreeleela: ఛీఛీ.. హీరోయిన్ శ్రీలీల క్యారెక్టర్ ఇలాంటిదా?

Sreeleela: తెలుగులో హీరోయిన్లకు వచ్చే స్టార్ డం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు తక్కువ చేసినా కానీ ట్యాలెంట్, అదృష్టం ఉంటే అలాంటి హీరోయిన్లకు రాత్రికి రాత్రే స్టార్ డం వచ్చేస్తుంటుంది. ఇలా ప్రస్తుతం తెలుగు సినిమాలతోనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ శ్రీలీల. తెలుగులో ‘పెళ్లిసందD’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. రవితేజతో తాజాగా ‘ధమాకా’ సినిమా చేసి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

 

 

బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. తర్వాత రోజు నుండి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘ధమాకా’తో రవితేజ చాలాకాలం తర్వాత హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి చేరడంతో.. ఈ విజయంలో హీరోయిన్ శ్రీలలకు కూడా క్రెడిట్ దక్కింది. లక్కీ హ్యాండ్ గా, హాట్ అందాలతో కుర్రకారును ఊపేస్తున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం.. టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది.

 

సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకున్న హీరోయిన్ శ్రీలీల.. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఓ ఛానల్ తో షేర్ చేసుకుంది. తనకు కోపం వస్తే అస్సలు ఆపుకోవడానికి వీలుకాదు అని శ్రీలీల వెల్లడించింది. తనను విసిగించే మాటలు చెబితే, అప్పటి వరకు ఏ మూడ్ లో ఉన్నా సరే వెంటనే ఫైర్ అవుతానని కూడా శ్రీలీల తన కోపం గురించి వివరించింది.

 

బేసిక్ గానే తనకు కోపం ఎక్కువ అని చెప్పిన హీరోయిన్ శ్రీలీల.. తనకు కోపం వస్తే నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తానని ఆమె తెలిపింది. తనకు కోపం వచ్చినప్పుడు తన తల్లి ఉన్నా కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తానని.. కోపం తగ్గిన తర్వాత తిట్టేశాను కదా అని బాధపడి ఏడుస్తానని ఆమె చెప్పింది. తల్లి కాబట్టి తన కోపాన్ని భరిస్తుందని, వేరే వాళ్లు అయితే తన దెబ్బకు పారిపోతారు కూడా అని శ్రీలీల వివరించింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -