Alia Bhatt-Ram Charan: అలియా భట్ ను రామ్ చరణ్ ఏమని పిలుస్తారో తెలుసా?

Alia Bhatt-Ram Charan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన సినిమా వాల్తీరు వీరయ్య కూడా ఈ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన నట వారసుడిగా పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తనదైన రీతిలో సినిమాలు చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నారు.

 

మెగా వారసుడిగా రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ మెయిన్ హీరోగా నటించి అద్భుత విజయాన్ని పొందారు. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. త్వరలోనే రామ్ చరణ్, శంకర్ కాంబో సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి.

 

ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటించింది. ఆమె క్యారెక్టర్ అందులో కొద్దిసేపే ఉన్నా చాలా మందికి కనెక్ట్ అయ్యింది. రామ్ చరణ్, అలియా ప్రేమ కథ సినిమాలో బాగానే చూపించకపోయినా హార్ట్ టచింగ్ సీన్స్ తో మాత్రం ఇరగదీశారు. తాజాగా ఈ జోడి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

 

చరణ్ అలియా ఒకే సినిమాలో కలిసి నటించినా కూడా వాళ్లిద్దరి మధ్య అన్నాచెల్లెలి అనుబంధం ఉందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ రకంగా వీరు అన్నాచెల్లెల్లు అవుతారనే ఓ టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ వార్త కొందరికి షాక్ కలిగిస్తుంటే మరికొందరికి మింగుడుపడటం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -