Adireddy Wife Kavitha: వైరల్ అవుతున్న ఆదిరెడ్డి భార్య షాకింగ్ కామెంట్స్!

Adireddy Wife Kavitha: బిగ్‌ బాస్‌ షో 6వ సీజన్‌ తాగాజా ముగిసింది. రేవంత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అనేక ట్విస్టుల మధ్య కొనసాగిన బిగ్‌ బాస్‌ షో.. ఆఖరికి రేవంత్‌వైపు మొగ్గు చూపారు బిగ్‌ బాస్‌. అయితే, మిగిలిన కంటెస్టెంట్లను సైతం జనాలు అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నారు. టీవీల ముందు కూర్చుంటే రోజూ హౌస్‌ సభ్యులు గుర్తుకొస్తున్నారని చర్చించుకుంటున్నారు.

 

గత సీజన్‌ కంటే కాస్త వెరైటీగా, కామన్‌గా పార్టిసిపెంట్‌ ఆదిరెడ్డిని తీసుకున్నారు నిర్వాహకులు. మరోవైపు బిగ్‌ బాస్‌ రివ్యూలు చెబుతూ పాపులర్‌ అయిన రీతూను కూడా హౌస్‌లోకి తీసుకున్నారు నిర్వాహకులు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్నన్ని రోజులు వీరిద్దరూ కాస్త సఖ్యతగానే ఉన్నారు. అయితే, బయటి నుంచి మాత్రం ఎవరి కుటుంబ సభ్యులు వారికి ఓట్లు వేసుకొనేలా ప్లాన్‌ చేసుకున్నారు.

 

తాజాగా వచ్చిన సమాచారం మేరకు.. బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఆదిరెడ్డి, గీతూ అత్యంత సన్నిహితంగా మెలగడంతో.. ఆదిరెడ్డి భార్య కవిత బాగా హర్ట్‌ అయ్యిందని తెలుస్తోంది. దాంతో వెంటనే తన భర్తను ఇంటికి పంపేయాలంటూ బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు ఫోన్‌ చేసి చెప్పిందట కవిత. ఒక వారం ఓట్లు కూడా వేసేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

 

ఈ వివరాలన్నీ ఓ అమ్మాయితో కవిత చెప్పినట్లు తెలుస్తోంది. బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఆదిరెడ్డి ఉన్నన్ని రోజులు నెగిటివ్‌ రివ్యూలు ఇచ్చిన ఓ అమ్మాయితో ఈ వివరాలన్నీ పంచుకుందట కవిత. ఆదిరెడ్డికి నెగిటివ్‌ రివ్యూలు ఇస్తున్న ఆ యువతితో కవిత మాట్లాడిందని తెలుస్తోంది. తాజాగా ఇది నిజమేనని క్లారిటీ వస్తోంది. అయితే, బిగ్‌ బాస్‌ హౌస్‌ నుంచి బయటకు రాగానే ఆదిరెడ్డి భార్యతో గీతూ మాట్లాడిందట. గేమ్‌లో భాగంగానే నీ భర్తతో క్లోజ్‌గా ఉన్నానని, అంతేకానీ ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసిందట. కవిత పల్లెటూరి అమ్మాయి కావడంతో ఇలా చేసిందని, ఇలా అనుమానించడంలో తప్పు లేదని గీతూ చెబుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -