Relationship: ఫస్ట్ నైట్ రోజు పురుషులు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో తెలుసా?

Relationship: పెళ్లయిన తర్వాత ఫస్ట్ నైట్ అనగానే ఎవరిలో అయినా కూడా కొంచెం ఉత్సాహం కొంచెం టెన్షన్ ఆందోళన కలగడం సహజం అని చెప్పవచ్చు. చాలామంది స్త్రీలు అలాగే పురుగులు ఫస్ట్ నైట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ నైట్ అనగానే అమ్మాయిలలో ఏ విధంగా అయితే ఆందోళన ఉంటుందో అలాగే అబ్బాయిల్లో కూడా ఒత్తిడి సమస్య ఉంటుంది. ఈ ఒత్తిడి సమస్యతో చాలామంది అబ్బాయిలు వారికి తెలియకుండానే కొన్ని రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు. మరి ఫస్ట్ నైట్ రోజున మగవారు చేసుకునే పొరపాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది అబ్బాయిలు పెళ్లి అనగానే స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటారు. ముఖ్యంగా మందు పార్టీలు చేసుకుంటారు.

 

ఈ క్రమంలో స్నేహితులు బలవంత పెట్టారంటూ చాలా మంది మందు తాగేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ నైట్ మందు తాగి అమ్మాయి దగ్గరకు వెళ్లడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి పొరపాటు మాత్రం అస్సలు చేయకపోవడం మంచిది. ఇక చాలా మంది అబ్బాయిలు సినిమాలు చూసి అందులో చూపించినవి చూసి నిజంగా తొలి రాత్రి అంటే ఇలానే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ సినిమాల్లో చూపించినట్లుగా ఉండదు. సినిమాలు చూసి నిజ జీవితంలో అంచనాలు పెంచుకోవడం పొరపాటు. అలా సినిమాలలో చూసి ఊహించుకుంటే మీ ఫస్ట్ నైట్ నాశనం అవుతుంది. చాలామంది పురుషులు పెళ్లి సమయంలో అలాగే పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ సమయంలో కొంచెం ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారు ముందుగా చేయాల్సిన పని అన్ని పనులు ముందుగానే ముగించుకోవాలి.

 

ఫస్ట్ నైట్ సమయంలో ఆ పనులు అన్నీ మర్చిపోయి భార్యతో ఏకాంతంగా గడపాలి. చాలా మంది పురుషులు పెళ్లి రోజు రాత్రి చాలా హ డావిడి చేస్తారు. తొలిరాత్రే పని పూర్తవ్వాలన్నట్లు చేస్తారు. ఇంతక ముందు ఎప్పుడూ కనీసం అమ్మాయిని కూడా చూడలేదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అలా చేయడం మంచిది కాదు. మీ భార్య సమ్మతి తీసుకోవడం కూడా చాలా అవసరం. ఆ తర్వాత కలయిక పై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఫస్ట్ నైట్ రోజున చాలా మంది పురుషులు భాగస్వామి అంగీకారం లేకుండానే ఎక్కువసార్లు పాల్గొనాలి అని చూస్తూ ఉంటారు. కానీ భాగస్వామి ఇస్టాను ప్రకారంగా నడుచుకోవడం మంచిది. ఇక ఎక్కువగా కోపం ఉన్న పురుషులు పెళ్లి తర్వాత ఏర్పాటు సరిగ్గా జరగలేదని చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల కొత్త జంట మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వధువు వాళ్లు మర్యాదలు తక్కువగా చేశారని అటువంటి విషయాలని ఆమెతో ప్రస్తావించి భార్యతో గొడవకు దిగటం మంచిది కాదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -