Live in Relationship: పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చా.. చట్టం చెప్పేది ఇదే!

Live in Relationship: సహజీవనం.. ప్రస్తుత రోజుల్లో యువతకు ఇది కామన్ అయిపోయింది. కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. సహజీవనం అంటే ఏమిటి? సహా అంటే కలసి లేదా తోడు. జీవనం అంటే జీవితం జీవితాన్ని కొనసాగించడం. అలా మొత్తంగా సహజీవనం అంటే ఇద్దరు కలిసి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కలిసి జీవితాన్ని పంచుకోవడం. పెళ్లి కాకుండానే ఒక అమ్మాయి, అబ్బాయి నాలుగు గోడల మధ్య కలిసి బతికే ఈ కల్చర్ ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయింది. దానికి లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే పేరును కూడా పెట్టారు.

ఈ సహజీవనం పేరు చెప్పుకొని పెళ్లి కాకుండానే యువతి,యువకులు ఒకే గదిలో కలిసి ఉండటం చట్టా పట్టాలు వేసుకొని తిరగడం ఈ క్రమంలోనే మానసికంగా శారీరకంగా కలిసిపోవడం ఆ తర్వాత మనస్పర్ధలు కారణంగా విడిపోవడం లాంటివి చేస్తున్నారు. అయితే చాలా వరకు పెళ్లి చేసుకొని పిల్లలు కనడం ఇష్టం లేని యువత ముందుగానే ఒక ఒప్పందం కుదుర్చుకొని సహజీవనం చేస్తున్నారు. ఈ సహజీవనంలో కూడా చాలా రకాల అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి అంటున్నారు. మొదటగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి కాకుండా అని ఒక గదిలో ఉండడం అన్నది తప్పు. కానీ ఈ మాట యువతకు చెబితే పట్టించుకోరు. యువత రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్పడం ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం లాంటిది ఫ్యాషన్ అయిపోయింది.

 

ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా స్త్రీలు ప్రెగ్నెంట్ అయినప్పుడు బాబు పాపా లేదా పుట్టినప్పుడు పురుషులు అనుకున్న అగ్రిమెంట్ కి ప్రకారం వారిని విడిచి వెళ్లిపోయినప్పుడు స్త్రీలు వారి హక్కులను కోల్పోతున్నారు. అంతేకాకుండా వారికి పుట్టే ఆ బాబుకు తండ్రి ఎవరో కూడా చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. అంతా జరిగిపోయిన తర్వాత చాలామంది న్యాయం చేయండి అంటూ రోడ్డు పెట్టడం పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కి న్యాయం చేయమంటూ పోరాటాలు కూడా మొదలుపెడుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్​షిప్ వ్యవస్థ పైకి చూడటానికి బాగానే ఉన్నా దీనివల్ల ఆడవాళ్లకు చాలా అన్యాయం జరుగుతోంది. కోరిక తీర్చుకుని ఆడవారిని వదిలేయడానికి మగవాళ్లు ఏర్పాటు చేసుకున్న అందమైన ముసుగు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఆడవాళ్లకు న్యాయం చేయడానికి వారి హక్కులను కాపాడటానికి సహజీవనం చేయకపోవడమే మంచిది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ వల్ల పిల్లలు కలిగితే వారికి ఎలాంటి హక్కులు ఉండవన్న విషయాన్ని కూడా హక్కుల ఉండవు. కాబట్టి నేటితరం యువత సహజీవనం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -