Veera Simha Reddy Telugu Movie Review: బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే.. సినిమా అదుర్స్ అనేలా?

Veera Simha Reddy Telugu Movie Review: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలలో నటించిన సమయంలో మెజారిటీ సందర్భాల్లో సక్సెస్ లను అందుకున్నారు. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లెజెండ్, అఖండ విజయాల తర్వాత బాలయ్య కెరీర్ లో ఆ స్థాయి హిట్ గా నిలిచే సినిమాల జాబితాలో వీరసింహారెడ్డి కూడా ఒకటి కావడం గమనార్హం. గోపీచంద్ మలినేని మాటల్లోనే కాదు చేతల్లో కూడా బాలయ్య అభిమాని అని ప్రూవ్ చేసుకున్నారు.

190 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాలో మెజారిటీ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు బాలయ్య గత సినిమాలను గుర్తు చేసినా అభిమానులకు మాత్రం వీరసింహారెడ్డి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. బీ, సీ సెంటర్స్ లో మరికొన్ని వారాల పాటు వీరసింహారెడ్డి సినిమాకు తిరుగులేదనే విధంగా ఈ సినిమా ఉంది. ఈ సినిమాలోని ఫ్యాక్టరీ శంఖుస్థాపన సీన్ అయితే మామూలుగా లేదనే చెప్పాలి.

ఫైట్ సీన్లు సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. క్వారీ ఫైట్, మ్యారేజ్ ఫైట్, సుగుణ సుందరి సాంగ్, ఎమోషనల్ సన్నివేశాలు, థమన్ బీజీఎం, డైలాగ్స్ బాగున్నాయి. రెండు పాత్రలలో బాలయ్య అద్భుతంగా నటించినా వీరసింహారెడ్డి పాత్రకే ఎక్కువ మార్కులు పడతాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలపై ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించి ఈ సినిమా ఉండనుంది.

బాలకృష్ణ ఈ సినిమాతో అఖండ సినిమాను మించిన విజయాన్ని అందుకున్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ తో బాక్సాఫీస్ కు శుభారంభం దక్కింది. బాలయ్య, వరలక్ష్మీ శరత్ కుమార్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. దునియా విజయ్ రూపంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో గొప్ప విలన్ దొరికారు. శృతి హాసన్, హనీ రోజ్ పాత్రల పరిధి మేర నటించారు. గోపీచంద్ మలినేని తాను బాలయ్యకు ఏ స్థాయి అభిమానో ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు. సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్, సాధారణ ఫ్యాన్స్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

బాలయ్య మాస్ ర్యాంపేజ్ వీరసింహారెడ్డి మూవీ అని చెప్పవచ్చు. కొంతమంది కావాలనే ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. వీరసింహారెడ్డి బాలయ్య మాస్ ఫ్యాన్స్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉంది.

రేటింగ్ : 2.5/5.0

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -