Balayya: బాలయ్య సినిమాకు సంబంధించి ఈ షాకింగ్ విషయం తెలుసా?

Balayya: నందమూరి బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య ఆ తరువాత వచ్చిన వీర సింహరెడ్డి సినిమా కూడా ఘన విజయం అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇలా వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాను NBK 108 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ గురించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య నటిస్తున్న ఎన్బికె 108 గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. అఖండ వీరసింహారెడ్డి వంటి యాక్షన్ సినిమాలతో హిట్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలను మించి ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఉంటాయని, ఆ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

 

ఈరోజు నుంచి రెండు వారాల పాటు ఫైట్ సీన్ ను షూట్ చేయనున్నారని సినిమాకు ఈ ఫైట్ సీన్ హైలెట్ గా నిలవడం గ్యారంటీ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా అనిల్ రావిపూడి కూడా సినిమాలో యాక్షన్ సీన్స్ ఉండేలాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఎన్బికే 108 సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -