Priyamani: ఆ సమస్య వల్లే ప్రియమణి ప్రెగ్నెంట్ కావడం లేదా?

Priyamani: తెలుగులో కొందరు హీరోయిన్లకు మాత్రమే టాప్ హీరోలతో కలిసి పని చేసే అవకాశాలు వస్తుంటాయి. ట్యాలెంట్ తో పాటు అందం కలిగిన హీరోయిన్లు ఇలాంటి అవకాశాలను కొట్టేస్తుండగా.. ఒకప్పుడు ఇలాంటి ఎన్నో అవకాశాలను అందుకున్న హీరోయిన్ ప్రియమణి. ‘ఎవరే అతగాడు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ ప్రస్తుతం.. తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.

 

తెలుగుతో పాటు తమిళం, హిందీలలో కూడా భారీగా హిట్ సినిమాల్లో నటించిన ప్రియమణి.. తెలుగులో గోపిచంద్, ఎన్టీఆర్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. తెలుగు వారికి ఎంతో దగ్గరైన ప్రియమణి.. తర్వాత మాత్రం కుర్ర హీరోయిన్ల వల్ల అవకాశాలను అనుకున్న స్థాయిలో దక్కించుకోలేకపోయింది. దీంతో కాస్త బ్రేక్ తీసుకొని తిరిగి తన కెరీర్ ని సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

 

మధ్యలో అమ్మడు ముస్తఫా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీలో వినిపించిన గుసగుసల ప్రకారం.. ముస్తఫా అనే వ్యక్తికి అంతకు ముందే పెళ్లి అవడంతో పాటు అతడికి పిల్లలకు కూడా ఉన్నారట. అయితే ప్రియమణి, ముస్తఫాలు ప్రేమించుకున్న నేపథ్యంలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి జరిగిన ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ప్రియమణి గుడ్ న్యూస్ చెప్పకపోవడానికి అదే కారణం అంటూ కొన్ని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

 

ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ని పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో కొనసాగిస్తుండగా.. ఆమె కావాలనే పిల్లల విషయంలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి మంచి అవకాశాలు పొందుతోందట. ఈ తరుణంలో తాను తల్లి అయితే ఇబ్బంది కలుగుతుందని, అలాగే పిల్లలు కంటే సినీ కెరీర్ మొత్తం పోతుందనే ఉద్దేశంతో పిల్లల విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ముస్తఫాకు మాత్రం పిల్లలు అంటే ఎంతో ఇష్టం కాగా.. ప్రియమణిని ఈ విషయంలో ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక ఏమీ అనలేకపోతున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -