Anasuya Bharadwaj: అనసూయ కామెంట్స్.. నువ్వు నీతులు చెప్పద్దంటూ నెటిజన్స్ ఫైర్!

Anasuya Bharadwaj:  టాలీవుడ్ బుల్లితెర హాట్ బ్యూటీ యాంకర్ అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై సమాన క్రేజీ సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపుతో దూసుకుపోతుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఇక తన సోషల్ మీడియా ఖాతాలో తన సంబంధించిన హాట్ ఫోటోలను పంపించడమే కాకుండా.. అప్పుడప్పుడు సమాజంలో జరిగే వాటిపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా చెడు కామెంట్ చేసిన కూడా వెంటనే రియాక్ట్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా తను ఒక కామెంట్ చేయడంతో ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

పైగా అది విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి చేసిందేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఏం కామెంట్ చేసిందంటే.. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా.. ఎదుటివారి బాధని చూసి సంతోష పడడం లేదు కానీ ధర్మమే గెలిచింది’ అంటూ అనసూయ కామెంట్ చేసింది.

దీంతో ఈ కామెంట్ విజయ్ దేవరకొండకే అని అంటున్నారు కొందరు. ఎందుకంటే ఆయన నటించిన లైగర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కాగా ఈ సినిమా మొదటికే డిజాస్టర్ అని టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా ప్లాప్ అయినందుకు తగిన శాసే జరిగిందన్నట్లు అనసూయ కామెంట్ చేసిందని అంటున్నారు.

ఎందుకంటే.. గతంలో విజయ్ దేవరకొండ నటించిన.. అర్జున్ రెడ్డి సినిమాలో అమ్మని తిట్టినట్లుగా ఉండే ఒక బూతు డైలాగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ డైలాగ్ ఆ సమయంలో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఆ డైలాగ్ ని అనసూయ వ్యతిరేకిస్తూ మీడియాకి ఎక్కింది. అమ్మని, అమ్మాయిలని నెగిటివ్ గా ఉపయోగించుకునే కంటెంట్ అవసరమా.. మనం పడే గొడవల్లో ఆడవాళ్ళని లాగడం ఏంటి.. ఇలాంటి వాటికి తానూ వ్యతిరేకం అంటూ అనసూయ అప్పట్లో మీడియాలలో బాగా కామెంట్లు చేసింది. ఇప్పుడు దానిని ఉద్దేశించే ఆమె అలా చేసిందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -