Vijay Deverakonda: విజయ్ సినిమా నుంచి శ్రీలీలను తప్పించడానికి ఆమె కారణమా?

Vijay Deverakonda: ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ బయట పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు ఆఖరిసారిగా అయినా ఖుషి ఈవెంట్స్ లో మాత్రమే కనిపించి అలరించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది అదే సమయంలో గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ పిరియాడిక్ చిత్రంలో నటిస్తున్నాడు.

 

ఇందులో శ్రీ లీల హీరోయిన్ గా ఈ చిత్రం ఆల్రెడీ ప్రారంభం అయింది. అయితే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో బిజీగా ఉండటం శ్రీ లీల పలు చిత్రాలకు కమిట్ అయి ఉండటం వల్ల డేట్లు అడ్జస్ట్ కాలేక ఈ సినిమా షూటింగ్ ఆశించినంత వేగంగా జరగడం లేదు. దీనికి తోడు ఇప్పుడు మరొక న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదో తెలియదు కానీ ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

 

కొందరు శ్రీ లీల వరుసగా పరాజయాలని చవిచూస్తుంది ఆ కారణంగానే సినిమా నుంచి తొలగించారు అని కొందరు అంటే కొందరు మాత్రం శ్రీ లీల ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చదువు ఆఖరి దశలో ఉండటం వలన పరీక్షలకు సమయం కేటాయించడం కోసం చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ లీల ప్లేస్ ని తృప్తి డిమ్రి రీప్లేస్ చేయబోతున్నట్లు సమాచారం.

తృప్తి డిమ్రి యానిమల్ మూవీలో నటించిన తర్వాత నేషనల్ వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఒక్క సీన్తో లెక్కలు మొత్తం మార్చేసింది అని కొందరు నెటిజెన్స్ కామెంట్స్ పెడుతుంటే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లకు తృప్తి డిమ్రి గట్టి పోటీ అవుతుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే కేవలం ఈమె కోసమే శ్రీ లీలని పక్కన పెట్టేశారా అలా అయితే శ్రీ లీల పరువు పోయినట్లే అని మరికొందరు నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -