Himaja: ఆ డబ్బులతోనే హిమజ కొత్త కారు కొనుగోలు చేసిందా?

Himaja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు తక్కువ సినిమాలు చేసినా మంచి గుర్తింపును సాధిస్తుంటారు. అదే సమయంలో కొంతమంది తక్కువ కాలం సినిమాల్లో కనిపించినా బాగా డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ నటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పెద్దగా సినిమాలు కూడా చేయని సదరు నటికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయనే చర్చ సాగుతోంది.

టాలీవుడ్ లో అప్పుడప్పుడు సినిమా స్క్రీన్ మీద మెరిసే బ్యూటీ హిమజ. వెండి తెర మీదే కాదు.. అప్పుడప్పుడు బుల్లితెర మీద కూడా కనిపిస్తూ కనువిందు చేస్తుంటుంది. అయితే పెద్దగా చెప్పుకోదగిన క్యారెక్టర్ చేయని హిమజకు పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. అయితే ఓ పక్క అవకాశామే దొరకని హిమజ.. డబ్బులు ఎక్కడి నుండి సంపాదిస్తోందనే చర్చ నడుస్తోంది.

మొన్నామధ్యన ఎంతో విలువైన ఇల్లును కట్టినట్లు ప్రకటించిన బ్యూటీ హిమజ.. ఆ మధ్యన ఓ కార్ కూడా కొనింది. ఇక తాజాగా సంక్రాంతి సందర్భంగా కూడా ఈ బ్యూటీ కొత్త కారును కొని అందరినీ ఆశ్చర్య పరిచింది. సంక్రాంతికి కియా కార్నివాల్ మోడల్ కారును కొన్నట్లు తెలుస్తుండగా..దీని ధర రూ.31లక్షల నుండి రూ.35.5లక్షల వరకు ఉంటుందని సమాచారం.

అంతకు ముందే కారును కలిగి ఉన్న హిమజ.. తనకు కంఫర్ట్ ముఖ్యం అని చెబుతూ కొత్త కారును అందుకోసమే కొంటున్నా అని పరోక్షంగా వెల్లడించింది. అయితే సినిమాల ద్వారా ఆదాయం లేని హిమజ.. లక్షల విలువ చేసే కొత్త కార్లను ఎలా కొంటోందని అందరూ చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే ఆ ట్రిక్ ఏదో మాకు కూడా చెప్పవా హిమజ అంటూ ఆమె ఫోటోల కింద కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -